మెరుగైన వైద్య సేవలు అందించండి

రాజంపేట ప్రభుత్వ ఆస్పత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన మంత్రి సురేష్‌

రాజంపేట: ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ వైద్యులకు సూచించారు. రాజంపేట ప్రభుత్వ ఆస్పత్రిని మంత్రి ఆదిమూలపు సురేష్‌ స్థానిక ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డితో కలిసి ఆకస్మిక తనిఖీ చేశారు. వైద్య సిబ్బంది రిజిస్టర్‌ను పరిశీలించారు. అనంతరం వార్డుల్లోకి వెళ్లి ఆస్పత్రిలో మెరుగైన సేవలు అందుతున్నాయా..? అని రోగులను అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రిలోని పారిశుద్ధ్య కార్మికులతో మంత్రి ముచ్చటించారు. అనంతరం బాలింతలకు డాక్టర్‌ వైయస్‌ఆర్‌ బేబీ కిట్‌ను అందజేశారు. 
 

Back to Top