వైట్ రెవ‌ల్యూష‌న్‌కు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ శ్రీ‌కారం

ప్ర‌తి గ్రామంలో వైయ‌స్ఆర్ చేయూత ల‌బ్ధిదారులు ఉన్నారు

బ్యాంకులు ఒకేసారి రూ.75 వేల వ‌డ్డీ లేని రుణాలు ఇచ్చేందుకు ముందుకు వ‌చ్చాయి

సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌పై న‌మ్మ‌కంతోనే బ్యాంకులు వ‌డ్డీ లేని రుణాలు ఇస్తున్నాయి

మంత్రి సీదిరి అప్ప‌ల‌రాజు

తాడేప‌ల్లి:  పాల ఉత్ప‌త్తులు, సేక‌ర‌ణ‌కు సంబందించి దాదాపు 50 ఏళ్ల త‌రువాత రాష్ట్రంలో మ‌ళ్లీ వైట్ రెవ‌ల్యూష‌న్‌ను ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి తీసుకురావ‌డానికి శ్రీ‌కారం చుట్టార‌ని మంత్రి సీదిరి అప్ప‌ల‌రాజు పేర్కొన్నారు. ఇందుకు వైయ‌స్ఆర్ చేయూత కార్య‌క్ర‌మం ఉప‌యోగ‌క‌రంగా ఉంటుంద‌న్నారు. చంద్ర‌బాబు ప్ర‌తిదీ అన‌వ‌స‌ర రాద్ధాంతం చేస్తున్నార‌ని ఆయ‌న మండిప‌డ్డారు. గురువారం సీదిరి అప్ప‌ల‌రాజు మీడియాతో మాట్లాడారు.

ప్ర‌తిప‌క్షాలు అన‌వ‌స‌ర రాద్ధాంతం..

సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన హామీ మేర‌కు 45 నుంచి 60 ఏళ్ల వ‌య‌సు ఉన్న మ‌హిళ‌ల‌కు ఏటా రూ.18,750 చొప్పున నాలుగేళ్ల‌ల‌లో రూ.75 వేలు ఆర్థిక సాయం చేస్తున్నార‌ని మంత్రి పేర్కొన్నారు. ఈ ప‌థ‌కం కింద నాలుగేళ్ల‌కు రూ.44 వేల కోట్లు  మంజూరు చేస్తాం. దీనిపై ప్ర‌తిప‌క్షాలు రాద్దాంతం చేయ‌డం ఆశ్చ‌ర్యం. గ‌తంలో చంద్ర‌బాబు మ‌హిళ‌ల‌కు ఇచ్చింది ఎక్క‌డ‌? గ‌తంలో బీసీ లోన్లు, ఎస్సీలోన్లు అంటూ గ్రామానికి ఒక‌రికి, ఇద్ద‌రికి మాత్ర‌మే ఇచ్చేవారు. వైయ‌స్ఆర్ చేయూత‌లో భాగంగా గ్రామంలో అర్హులంద‌రికీ రూ.18,750 చొప్పున ఇచ్చామ‌న్నారు. చేయూత‌లో పంచాయ‌తీ రాజ్‌, సెర్ఫ్ డిపార్టుమెంట్ ఆధ్వ‌ర్యంలో గ్రామాల్లో మ‌హిళ‌ల‌కు ఆర్థిక స్వావ‌లంబ‌న చేకూర్చే దిశ‌గా అడుగులు వేస్తున్నారు. మొన్న‌నే గ్రూప్ ఆప్ క‌మిష‌న‌ర్లుతో క‌లిసి స‌మావేశం నిర్వ‌హించాం. ప్ర‌వేట్ సంస్థ‌ల ప్ర‌తినిధుల‌తో కూర్చొని యాక్ష‌న్ ప్లాన్ తయారు చేశాం. సెర్ప్ బాధ్య‌త ఏంటంటే ప్రాజెక్టులు, అప్టిమైజ్‌డ్ యూనిట్లు రూపొందించి బ్యాంకుల‌ను లింక్ చేయ‌డ‌మే. మెడ‌రేట్ వైబుల్ యూనిట్లు త‌యారు చేసి బ్యాంకుల ద్వారా లింక్ చేయ‌డం జ‌రుగుతుంది. నాలుగేళ్ల‌లో రూ.75 వేలు మ‌హిళ‌ల‌కు ఇస్తూ వారిని పారిశ్రామిక‌వేత్త‌లుగా మార్చ‌డ‌మే. ఇది గొప్ప అవ‌కాశం. బ్యాంకులు ముందుకు వ‌స్తున్నాయంటే కేవ‌లం వైయ‌స్ జ‌గ‌న్‌పై ఉన్న న‌మ్మ‌క‌మే. ఇప్ప‌టికే వ‌డ్డీ లేని రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు ముందుకు వ‌చ్చాయి. నాలుగు విడ‌త‌లు క‌లిపి ఒకే సారి బ్యాంకు గ్యారెంటీతో ముందుకు వ‌చ్చారు.

సింగిల్ ప్రీమియంలో రూ.75 వేలు ..
 
విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో కూడా సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఒక క్యాలెండ‌ర్ రూపొందించి వాటి ప్రకారం సంక్షేమ కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్నారు. బ్యాంకుల‌కు కూడా సీఎం వైయ‌స్ జ‌గ‌న్ విశ్వాసాన్ని పెంపొందించారు. అందుకే వాళ్లు కూడా బ్యాంకు లింకేజీ ద్వారా సింగిల్  ప్రీమియంతో వ‌డ్డీ లేని రుణాలు ఇచ్చేందుకు ముందుకు వ‌చ్చాయి. దానికి ప్ర‌భుత్వ‌మే గ్యారెంటీ ఇస్తుంది. మిగిలిన మూడు విడ‌త‌లు కూడా ప్ర‌భుత్వ‌మే చెల్లిస్తుంది. సెర్ప్ వాళ్లు టెక్నిక‌ల్, మార్కెట్ స‌పోర్టు ఇస్తారు. చేయూత‌లో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి చేసేందుకు బ్యాంకులు ముందుకు వ‌చ్చాయి. సింగిల్‌, గ్రూప్ ఎంట‌ర్‌ప్రైజేస్ ద్వారా ప‌రిశ్రమ‌లు వృద్ధి చేసే కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్నాం. 

డ‌యిరీల అభివృద్ధికి ప్ర‌ణాళిక‌..

పాల ఉత్ప‌త్తుల‌కు సంబంధించి వైట్ రెవ‌ల్యూష‌న్ తీసుకువ‌చ్చిన ఘ‌న‌త డాక్ట‌ర్ కురియ‌న్ ది. 50 ఏళ్ల త‌రువాత సీఎం వైయ‌స్ జ‌గ‌న్ వైట్ రెవల్యూష‌న్‌ను కొన‌సాగించేందుకు మ‌రో అడుగు ముందుకు వేశారు. ఇది శుభ‌ప‌రిణామం. యానిమ‌ల్ హ‌స్పండ‌రీ, డైయిరీల అభివృద్ధికి మార్గంగా భావించి డ‌యిరీ డెవ‌ల‌ప్‌మెంట్‌ను ప‌ట్టాలెక్కించేందుకు చేయూత కార్య‌క్ర‌మం ఉప‌యోగ‌క‌రంగా ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో పాల సేక‌ర‌ణ దాదాపు 80 శాతం ఉంటుంది. 20 శాతం పాల‌సేక‌ర‌ణ మాత్ర‌మే ఆర్గ‌నైజ‌డ్ సెక్టార్‌లో ఉంది. గుజ‌రాత్‌, క‌ర్నాట‌క రాష్ట్రాల్లో పాల సేక‌ర‌ణ 80 శాతం ఆర్గ‌నైజ్‌డ్ సెక్టార్‌దే. అక్క‌డి పాడి రైతులు గ‌ణ‌నీయంగా అభివృద్ధి చెంద‌డం చూశాం. అందుకే పాల సేక‌ర‌ణ‌ను ప్రోత్స‌హించేందుకు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ వైయ‌స్ఆర్ చేయూత కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్టార‌ని మంత్రి అప్ప‌ల‌రాజు పేర్కొన్నారు. 

 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top