బాబు రాసిచ్చిన స్క్రిప్ట్ చదవడమే పవన్ కు తెలుసు

 మంత్రి ఆర్కే రోజా

కృష్ణా జిల్లా: చంద్రబాబు నాయుడు రాసిచ్చిన స్క్రిప్ట్ చ‌ద‌వ‌డ‌మే పవన్‌ కళ్యాణ్‌కు తెలుసు అని మంత్రి ఆర్‌కే రోజా మండిపడ్డారు. చంద్రబాబు పూనిన చంద్రముఖిలా పవన్‌ పిచ్చిగంతులేస్తున్నాడంటూ మంత్రి   ధ్వజమెత్తారు. ‘పవన్‌ కళ్యాణ్‌ ఓ పనికిమాలినవాడు. కోవిడ్‌ సమయంలో బాబు, పవన్‌ హైదరాబాద్‌లో దాక్కున్నారు. మీకు చప్పట్టు కొట్టేవారికి కోవిడ్‌ సమయంలో సేవలందించి వలంటీర్లే. 

బాబు సమయంలో జన్మభూమి కమిటీల పేరుతో మోసం జరిగితే నీ నోరెందుకు లేవలేదు పవన్. పవన్‌కు చట్టాల గురించి తెలియదు.చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్ చదవడమే పవన్ కు తెలుసు. ఎవరూ బాగుండకూడదు... అందరూ కష్టాల్లో ఉండాలని పవన్ అనుకుంటున్నాడా?, ఎంతసేపూ మా అమ్మను అన్నారు...నా పెళ్లాన్ని అన్నారు...నా పిల్లలను తిట్టారని ఏడుపే కనబడుతోందంటూ రోజా విమర్శించారు.

పవన్‌ సంస్కారం గురించి చెప్తుంటే సన్నీ లియోన్‌ వేదాలు వల్లించినట్లుంది. ఎవరి మాట వినడు కాబట్టే పవన్‌ను భార్యలు వదిలేశారు. బ్యాంకులు, మీ సేవా కేంద్రాలు కూడా వివరాలు అడుగుతాయి. డేటా తీసుకుని అక్రమ రవాణా చేస్తున్నారని మోదీని అనగలవా పవన్‌?, ఎన్‌సీబీఆర్‌ రిపోర్ట్‌లో తెలంగాణ టాప్‌ టెన్‌లో ఉంది. అక్కడ మాట్లాడితే కేసీఆర్‌ మక్కెలు విరగ్గొడతారని భయమా? అని మంత్రి రోజా నిలదీశారు.

Back to Top