జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశాం 

లోతట్టు ప్రాంతాల ప్రజలకు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశాం

ప్రకాశం బ్యారేజీ వద్ద పరిస్థితిని పరిశీలించిన మంత్రి పేర్ని నాని

కృష్ణా: ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణా నది వరద ఉధృతిని రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని పరిశీలించారు. జిల్లా కలెక్టర్‌ ఇంతియాజ్‌తో పాటు ఎమ్మెల్యేలు వసంత కృష్ణప్రసాద్, సింహాద్రి ప్రసాద్‌లతో కలిసి మంత్రి పేర్ని నాని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కృష్ణా నది వరద పరిస్థితిని ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం శ్రమిస్తోందని, లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తూ ముందస్తు చర్యలకు సన్నద్ధంగా ఉందన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలకు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. వరద ఉధృతి తగ్గే అవకాశం ఉందని చెప్పారు. పరిస్థితులను చక్కదిద్దేందుకు యంత్రాంగం కృషి చేస్తోందననారు.

ఏడాది కాలంగా రాష్ట్రం సస్యశ్యామలంగా ఉంది. సకాలంలో వర్షాలు పడటంతో ప్రాజెక్టులకు జలకళ వచ్చిందని మంత్రి పేర్ని నాని అన్నారు. నీటికొరత లేకపోవడంతో పంటలు సమృద్ధిగా పండి రైతులు ఆనందంగా ఉన్నారన్నారు. ఫ్లడ్‌ మేనేజ్‌మెంట్‌లో అధికారుల శ్రమ అభినందనీయం. టీడీపీ నేతలు వరదలను కూడా రాజకీయం చేయాలని చూస్తున్నార‌ని మంత్రి పేర్ని నాని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top