ఈ మూడున్నర ఏళ్ళలో విద్యుత్‌ రంగంలో ఎన్నో మార్పులు

 మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 

నెల్లూరు:  వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ముఖ్య‌మంత్రి అయ్యాక ఈ మూడున్న‌ర ఏళ్ల‌లో విద్యుత్ రంగంలో ఎన్నో మార్పులు తెచ్చార‌ని మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి తెలిపారు. నేల‌టూరులో దామోద‌రం సంజీవ‌య్య థ‌ర్మ‌ల్ ప‌వ‌ర్ ప్లాంట్ ప్రారంభోత్స‌వ స‌భ‌లో మంత్రి మాట్లాడారు. 

అందరికీ నమస్కారం, ఈ రోజు 800 మెగావాట్ల ఉత్పత్తి సామర్ధ్యం గల సూపర్‌ క్రిటికల్‌ టెక్నాలజీతో భారతదేశంలోనే మొట్టమొదటి సారి 2008లో దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి గారు ఫౌండేషన్‌ స్టోన్‌ వేసిన దానిని మన సీఎంగారు ప్రారంభించారు. ఈ మూడున్నర ఏళ్ళలో విద్యుత్‌ రంగంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చారు. చంద్రబాబు పాలనలో ఏవైతే నష్టాల ఊబిలో కూరుకుపోయిన విద్యుత్‌ రంగాన్ని వాటన్నింటిని మార్చి ముందుకు తీసుకెళుతున్నారు. 24 గంటలు నిరంతర విద్యుత్‌ నాణ్యమైనది ఇవ్వడం, రైతులకు చెప్పినట్లు నిరంతరాయంగా పగటి పూట 9 గంటల విద్యుత్‌ ఇస్తున్నారు. నాడు చంద్రబాబు ప్రజాధనాన్ని దోపిడీ చేస్తే దానిని అరికట్టి ఆదా చేయడంతో మన ప్రభుత్వానికి కేంద్రం నుంచి అవార్డు కూడా వచ్చింది. రోజు రోజుకు పెరుగుతున్న విద్యుత్‌ వినియోగాన్ని బట్టి ఉత్పత్తి కూడా పెంచాలని సీఎంగారు అనేక సంస్కరణలు తీసుకొస్తున్నారు.

2018–19 లో 50 వేల మిలియన్‌ యూనిట్ల వినియోగం కాస్తా 2021–22 లో అది 61 వేల మిలియన్‌ యూనిట్లకు పెరిగింది. భారతదేశంలోనే ఒక లీడ్‌ రాష్ట్రంగా మన సీఎంగారు పంప్డ్‌ స్టోరేజ్‌ ప్రాజెక్ట్‌ ద్వారా ఉత్పత్తిని పెంచడమే కాకుండా ఉత్పత్తి ఖర్చు తగ్గేలా ప్రణాళికలు రూపొందించారు. ఇవన్నీ ఆచరణలోకి వస్తే మనం ఇతర రాష్ట్రాలకు విద్యుత్‌ ఇచ్చే పరిస్ధితి వస్తుంది. ఈ రోజు ట్రాన్స్‌కో అభివృద్ది కోసం దాదాపు నాలుగువేల కోట్లతో కొత్త సబ్‌స్టేషన్లు నిర్మించడం, కొత్త లైన్లు వేయడం, కొత్త ట్రాన్స్‌ఫార్మర్‌లు ఏర్పాటుచేయడం, చెడిపోయిన ట్రాన్స్‌ఫార్మర్‌లు రిపేర్‌ చేయడం కోసం ఈ డబ్బు వెచ్చించి ట్రాన్స్‌కోను ముందుకు తీసుకెళుతున్నారు. చవక విద్యుత్‌ తీసుకొచ్చి ఆదా చేయాలనే ఉద్దేశ్యంతో ఈ మూడేళ్ళలో దాదాపు రూ. 4,925 కోట్లు ఆదా చేయడం జరిగింది. డిస్కంలు ఆదుకునేందుకు రూ. 40 వేల కోట్ల ఆర్ధిక సాయం ఈ మూడేళ్ళలో సీఎంగారు చేశారు. ప్రజలకు నాణ్యమైన విద్యుత్‌ ఇవ్వాలని ఈ సీఎంగారు ఆలోచన చేస్తే చంద్రబాబు మాత్రం తన హయాంలో పవర్‌ పర్చేజ్‌ అగ్రిమెంట్‌లు అడ్డగోలుగా చేసుకుని ఈ డిస్కంలకు రూ. 20 వేల కోట్లకు పైగా నష్టం వాటిల్లేలా చేశారు. ఈ రోజు జెన్‌కో ఉత్పత్తి సామర్ధ్యం 7,189 మెగావాట్లు, ధర్మల్‌ క్రింద 5,010 మెగావాట్లు, జలవిద్యుత్‌ 1,774 మెగావాట్లు, సౌర విద్యుత్‌ 405 మెగావాట్లు ఇలా మొత్తం మనకు అవసరమైన 45 శాతం విద్యుత్‌ను జెన్‌కో ద్వారా ఉత్పత్తి చేస్తున్నాం. ఈమూడేళ్ళలో సీఎంగారు ప్రతి నెలా కూడా విద్యుత్‌ శాఖపై సమీక్ష జరిపి అన్ని రకాలుగా అండదండగా ఉన్నారు. ఈ విద్యుత్‌ శాఖ కూడా 20 సంవత్సరాల తర్వాత ఏ విధంగా ఉండాలనే ఆలోచనతో సీఎంగారు ఉన్నారు. మనకు ఎవరూ శత్రువులు లేరు, కానీ ఒక టీవీ 5, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి, ఈనాడు, వారికి తోడు దత్తపుత్రుడు కలిసి కుట్రపూరిత వ్యవహారంతో తప్పుడు సమాచారం మీకంతా టీవీల్లో చూపుతూ పత్రికల్లో రాస్తున్నారు. చంద్రబాబును సీఎం చేయాలన్న ఆలోచనతో రామోజీరావు వయసు మీరినా కూడా అనేక అబద్దాలతో పెద్ద పెద్ద శీర్షికలు రాస్తూ తప్పుడు సమాచారం ఇస్తున్నారు, కానీ మనం వాస్తవాలు గ్రహించాలి, మన కుటుంబాలు ఎలా ఉన్నాయి, మనకు మంచి విద్య, వైద్యం అందిందా, మనం ఈ మూడున్నర ఏళ్ళలో ఏ విధంగా అభివృద్ది చెందామో ఆలోచించండి, మీరు ఈ పచ్చ పత్రికలు చదవద్దు, ఈ పచ్చ టీవీలు చూడద్దు, ఈ పచ్చరాతల్ని బహిష్కరించండి అని మీ అందరికీ మనవి చేస్తున్నాను.  

Back to Top