ప్ర‌జాసంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి ల‌క్ష్యంగా పాల‌న

పుంగ‌నూరులో గ‌డ‌ప గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మంలో మంత్రి పెద్దిరెడ్డి 

చిత్తూరు: ప్ర‌జా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి ల‌క్ష్యంగా ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి పాల‌న సాగుతోంద‌ని, ఎన్నిక‌ల మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాల్లో 95 శాతం మూడేళ్ల‌కాలంలోనే అమ‌లు చేశార‌ని రాష్ట్ర ఇంధ‌న‌, అట‌వీ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి అన్నారు. పుంగనూరు నియోజకవర్గంలోని పుంగనూరు రూరల్ మండలం బొడేవారిపల్లి పంచాయతీలో గ‌డ‌ప గ‌డ‌ప‌కూ మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మంలో మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా గ్రామంలో ఇంటింటికీ తిరిగి సంక్షేమ ప‌థ‌కాల అమ‌లు గురించి ఆరా తీశారు. వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌భుత్వం అందిస్తున్న సంక్షేమ ప‌థ‌కాల గురించి బోడేవారిప‌ల్లి గ్రామ ప్ర‌జ‌ల‌కు వివ‌రించారు. ఈ కార్య‌క్ర‌మంలో మంత్రితో పాటు చిత్తూరు ఎంపీ  రెడ్డప్ప, ఎంపీపీ, జెడ్పీటీసీ, ఇతర ప్రజా ప్రతినిధులు,అధికారులు పాల్గొన్నారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top