ఎన్నికలు ఎప్పుడు జరిగినా వైయ‌స్ఆర్‌సీపీ విజయం

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

 చిత్తూరు: ఎన్నికలు ఎప్పుడు జరిగినా వైయ‌స్ఆర్‌ సీపీదే విజయం అని రాష్ట్ర పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో అందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డికి వస్తున్న ఆదరణను చంద్రబాబు ఓర్వలేకపోతున్నారన్నారు. ‘చంద్రబాబు ఎన్ని అబద్ధాలు చెప్పినా ప్రజలు నమ్మరు. ఆయన ఇకనైనా తప్పుడు ఆరోపణలు మానుకోవాలని’ పెద్దిరెడ్డి హితవు పలికారు. 

Back to Top