శ్రీకాకుళంలో ఇంధన కొరతపై నిర‌స‌న 

శ్రీకాకుళం : రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరతపై తీవ్ర చర్చ జరుగుతున్న నేపథ్యంలో శ్రీకాకుళం నియోజకవర్గంలో సమస్య మరింత తీవ్రంగా ఉందని వైయ‌స్ఆర్‌సీపీ యువనేత ధర్మాన రామ్ మనోహర్ నాయుడు పేర్కొన్నారు. కార్పొరేషన్ పరిధిలో పలు పెట్రోల్ బంకులను పరిశీలించి వాహనదారులతో మాట్లాడి వారి ఇబ్బందులను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చాలా బంకుల వద్ద వాహనదారులు గంటల తరబడి క్యూలలో నిలబడాల్సి వస్తోందని, కొన్ని చోట్ల నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయని తెలిపారు. ప్రజల ఇబ్బందులను ముందుగానే గుర్తించి చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈ సమస్య ఉత్పన్నమైందని విమర్శించారు. ఈ సంక్షోభానికి పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని, ముఖ్యమంత్రి వెంటనే స్పందించి పెట్రోల్, డీజిల్ సరఫరాను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ప్రజలు పడుతున్న ఇబ్బందులను తక్షణమే పరిష్కరించాలని హితవు పలికారు. 

Back to Top