దమ్ముంటే..చంద్రబాబు పుంగనూరు నుంచి పోటీ చేయాలి

గతంలో చంద్రబాబు పథకాలు వాళ్ల అబ్బ సొత్తుతో అమలు చేశారా?
 
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

విజయవాడ: ప్రతిపక్ష నేత చంద్రబాబుకు దమ్ముంటే చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని మంత్రిపెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సవాలు విసిరారు. కుప్పంలో ఓడిపోయినా చంద్రబాబుకు కనువిప్పు కలగలేదని పేర్కొన్నారు. కుప్పంలో ఓటమితో చంద్రబాబులో అసహనం విపరీతంగా పెరిందని విమర్శించారు. కరోనా కష్టకాలంలో కూడా చంద్రబాబు కుప్పం వైపు చూడలేదననారు. ఇప్పుడు కుప్పంలో ఓటమిపాలయ్యే సరికి ప్రజలు గుర్తుకు వచ్చారని మండిపడ్డారు. పులివెందుల, పుంగనూరు వచ్చి చంద్రబాబు ఏం చేస్తారని ప్రశ్నించారు. చంద్రబాబు మిథున్‌రెడ్డిని అక్రమంగా 15 రోజులు జైల్లో పెట్టించారని గుర్తు చేశారు.గతంలో చంద్రబాబు పథకాలు వాళ్ల అబ్బ సొత్తుతో అమలు చేశారా అని నిలదీశారు. సీఎం వైయస్‌ జగన్‌ పథకాల వల్లే రాష్ట్రమంతటా టీడీపీని ఓడించారని తెలిపారు.
 

తాజా ఫోటోలు

Back to Top