సీఎం వైయస్‌ జగన్‌ చరిత్రలో నిలిచిపోతారు

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఉప ముఖ్యమంత్రులను చేశారు

డిప్యూటీ సీఎం, ఎక్సైజ్‌ మినిస్టర్‌ నారాయణస్వామి

అమరావతి: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా సమాన హక్కు కల్పించిన ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చరిత్రలో నిలిచిపోతారని ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల తలరాతలు మార్చుతూ.. వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్న వ్యక్తి సీఎం వైయస్‌ జగన్‌ అని అన్నారు. విదేశీ మద్య నియంత్రణ బిల్లుపై సభలో ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి మాట్లాడుతూ.. మేనిఫెస్టోను భగవద్గీత, బైబిల్, ఖురాన్‌గా భావించి ప్రజలకు ఇచ్చిన హామీలను ఒకొక్కటిగా అమలు చేస్తున్నారన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల సామాజిక వర్గాలవారంతా మీటింగ్‌లు పెట్టుకొని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ను దేవుడిలా కొలుస్తున్నారన్నారు. కుల, మత, రాజకీయం లేని సమాజాన్ని దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి నిర్మించారన్నారు. ఆయన మరణించిన తరువాత ప్రతి ఇంట్లో వైయస్‌ఆర్‌ను భగవంతుడిలా పూజిస్తున్నారన్నారు. ప్రతి పేదవాడి గుడిసెలో అడుగుపెట్టిన నాయకుడు వైయస్‌ జగన్‌ అని, ఓదార్పు యాత్ర, ప్రజా సంకల్పయాత్ర ద్వారా ప్రజలందరికీ దగ్గరయ్యారని చెప్పారు. 

మద్యపానం వల్ల అనేక కుటుంబం రోడ్డున పడ్డాయని, ఆ కుటుంబం పడిన బాధలన్నీ పాదయాత్రలో వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విన్నారన్నారు. అందుకే ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ దశలవారీగా మద్యపాన నిషేదం కార్యక్రమాన్ని తీసుకువచ్చారన్నారు. ప్రతి కుటుంబం సంతోషంగా ఉండాలని భావించాలన్నారు. ఆడపడుచు సంతోషంగా ఉంటుందో ఆ కుటుంబం ఆనందంగా ఉంటుందని ప్రభుత్వం నమ్మిందన్నారు. పేదవాడికి ఉప ముఖ్యమంత్రి, ఎక్సైజ్‌ శాఖ మంత్రి పదవి ఇచ్చిన నాయకుడు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, ముఖ్యమంత్రి తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానన్నారు. తన శాఖను అవినీతి రహితంగా తయారు చేస్తానన్నారు.

 

Back to Top