వైయస్‌ఆర్‌సీపీలోకి మంత్రి నారాయణ తోడల్లుడు రామోహ్మన్‌ 

నెల్లూరు జిల్లా: ఎన్నికల సమయంలో వైయస్‌ఆర్‌సీపీలోకి జోరుగా చేరికలు సాగుతున్నాయి. మంత్రి నారాయణ తోడల్లుడు రామ్మోహన్,పలువురు అనుచరులు వైయస్‌ఆర్‌సీపీలోకి చేరారు.నెల్లూరు లోక్‌సభ అభ్యర్థి ఆదాల ప్రభాకర్‌ రెడ్డి, సిటీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌ సమక్షంలో పార్టీలోకి చేరారు.వారికి పార్టీ కండువాలు వేసి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.నెల్లూరు నగరాన్ని  5 వేల కోట్లతో అభివృద్ధి చేశానని చెబుతున్న మంత్రి నారాయణ డబ్బుతో ఎందుకు ఓట్లు కొంటున్నారని ఆయన తోడల్లుడు రామ్మోహన్‌  ప్రశ్నించారు.వైయస్‌ఆర్‌సీపీ పార్టీలో చేరడం సంతోషంగా ఉందన్నారు.గత తొమ్మిది సంవత్సరాలుగా దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖర్‌రెడ్డి ఆశయాలు, సంక్షేమ పథకాలు ప్రజల్లో తీసుకెళ్తున్న  వైయస్‌ జగన్‌పై  కుట్రలకు పాల్పడుతున్నారని తెలిపారు.

మంత్రి నారాయణ విధానాలు నచ్చక పలువురు టీడీపీ పార్టీని వీడుతున్నారని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌ యాదవ్‌ అన్నారు.రాష్ట్ర భవిష్యత్‌ను ముందుకు తీసుకెళ్లే నాయకుడు వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అని అన్నారు. చంద్రబాబు అసురరూపం తెలుసుకుని వైయస్‌ఆర్‌సీపీలోకి చేరుతున్నారని నెల్లూరు పార్లమెంటు అభ్యర్థి ఆదాల ప్రభాకర్‌రెడ్డి అన్నారు.ఐదేళ్లు దోపిడీ చేసి ఎన్నికలు రావడంతోనే తాయిలాలు ఇచ్చి ఓట్లు కొనేందుకు టీడీపీ డబ్బులు వెదజల్లుతుందన్నారు. ఎన్నికల్లో టీడీపీని ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.

తాజా వీడియోలు

Back to Top