పార్వతీపురం మన్యం జిల్లా: పాలకొండ - సీతంపేట ఘాట్ రోడ్ వద్ద ఆటో లోయలో పడి నలుగురు ప్రాణాలు కోల్పోవడం పట్ల మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్‌సీపీ అధినేత శ్రీ వైయస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శుభకార్యానికి వెళ్ళి వస్తున్న వారు ఈ ప్రమాదంలో మృతి చెందడం అత్యంత విషాదకరమని ఆయన పేర్కొన్నారు. ఈ ఘటనలో మరి కొందరు గాయపడటం ఆందోళన కలిగిస్తోందన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఈ కష్ట సమయంలో వారికి ధైర్యం కలగాలని ఆకాంక్షించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. ప్రమాదానికి గల కారణాలను సమగ్రంగా పరిశీలించి, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రహదారి భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.