ఉల్లి ధరను అదుపులోకి తెచ్చాం

టమాట రైతులను ఆదుకున్నాం

పశుసంవర్ధక, మత్స్య, మార్కెటింగ్‌ శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ

తాడేపల్లి: ఉల్లి ధరను అదుపులోకి తీసుకువచ్చామని, ప్రభుత్వ చొరవతో రైతుబజార్‌లలో రూ. 25కే విక్రయాలు చేపడుతున్నామని పశుసంవర్ధక, మత్స్య, మార్కెటింగ్‌ శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ అన్నారు. రాష్ట్రంలో ఉల్లి కొరత ఏర్పడడంతో ఇతర రాష్ట్రాల నుంచి సప్లయ్‌ చేయించామన్నారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌తో సమీక్ష అనంతరం మంత్రి మోపిదేవి వెంకట రమణ మీడియాతో మాట్లాడుతూ.. మార్కెట్‌లో రూ. 50 ఉంటే రైతుబజార్‌లో ప్రభుత్వం చొరవతో రూ. 25కే విక్రయాలు చేస్తున్నామన్నారు. ఆర్థిక భారాన్ని కూడా లెక్కచేయకుండా వినియోగదారులందరికీ తక్కువ ధరలకు ఉల్లిని అందించాలనే నిర్ణయం మేరకు రైతుబజార్‌లో రూ. 25కే అందిస్తున్నామన్నారు. కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరలకు అమ్ముకోవాలని చూసిన దళారుల గోదాములపై విజిలెన్స్‌ అధికారులతో దాడులు చేయించామన్నారు. ప్రభుత్వ నిర్ణయంతోనే ఉల్లిధర అదుపులోకి వచ్చిందన్నారు.  

టమాటా రైతులు నష్టపోకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుందని మంత్రి మోపిదేవి వెంకట రమణ అన్నారు. టమాటా దిగుబడి ఎక్కువగా ఉన్న మదనపల్లి, పీలేరు ప్రాంతాల మార్కెట్‌లలో దిగుబడి ఎక్కవగా రావడంతో రైతులు నష్టపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. రైతులు నష్టపోకూడదని ప్రభుత్వం చొరవ తీసుకొని వారికి గిట్టుబాటు ధర కల్పించిందని, ఆ టమాటాను ఇతర రాష్ట్రాల మార్కెట్‌లకు తీసుకెళ్లి విక్రయించి ఆదుకున్నామన్నారు.

 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top