వరద సహాయక చర్యలపై సీఎం నిత్యం సమీక్షలు

మంత్రి మోపిదేవి వెంకటరమణ

ముంపు ప్రాంతాల్లో పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్‌ పునరుద్ధరిస్తాం

గుంటూరు: వరద సహాయక చర్యలపై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నిరంతరం మాట్లాడుతున్నారని మంత్రి మోపిదేవి వెంకటరమణ తెలిపారు. నిత్యం మంత్రులు, అధికారులతో సీఎం సమీక్షలు నిర్వహించి పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారని చెప్పారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. వరద తగ్గుముఖం పడుతోందన్నారు. ముంపు ప్రాంతాల్లో సమస్యలపై దృష్టి పెట్టినట్లు చెప్పారు. ముంపు ప్రాంతాల్లో పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్‌ పునరుద్ధరిస్తామన్నారు. ప్రతి గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సహాయక చర్యలు చేపట్టినట్లు చెప్పారు. 
 

Back to Top