సీఎం వైయ‌స్‌ జగన్‌ ఎక్కడ ఆదేశిస్తే అక్కడ నుంచి పోటీ 

నియోజకవర్గం మార్పుపై స్పందించిన మంత్రి మేరుగ నాగార్జున 

తాడేప‌ల్లి: సీఎం వైయ‌స్‌ జగన్ మోహ‌న్ రెడ్డి ఎక్కడ ఆదేశిస్తే అక్కడ నుంచి పోటీ చేస్తాన‌ని మంత్రి మేరుగ నాగార్జున పేర్కొన్నారు. టార్గెట్ 175 ల‌క్ష్యంగా 2024 ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా వైయ‌స్ఆర్‌సీపీ అధినేత, సీఎం వైయ‌స్ జగన్ ఆదేశాల మేర‌కు 11 నియోజకవర్గాల్లో కొత్త వారికి బాధ్యతలు అప్పగించింది. మేరుగ నాగార్జునకు సంతనూతలపాడు బాధ్యతలు అప్పగించారు. నియోజకవర్గ మార్పుపై తొలిసారి స్పందించిన మంత్రి మేరుగ నాగార్జున ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

తనకు నియోజకవర్గం మార్పుపై ఎలాంటి అసంతృప్తి లేదని మంత్రి మేరుగ నాగార్జున పేర్కొన్నారు. వేమూరు నియోజకవర్గం నుంచి మూడు సార్లు వైయ‌స్ జ‌గ‌న్‌ బొమ్మపై గెలిచాను.. ఇప్పుడు సంతనూలపాడు నియోజకవర్గానికి ఇంఛార్జ్‌గా ఉన్నానని తెలిపారు. సీఎం వైయ‌స్‌ జగన్‌ ఎక్కడ ఆదేశిస్తే అక్కడ నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. అంతేకాదు, ఎమ్మెల్యేల్లో ఎవరికీ అసంతృప్తి లేదు.. అందరూ మా వాళ్లే.. అందరూ సీఎం వైయ‌స్‌ జగన్‌ కోసం పనిచేస్తారని మంత్రి మేరుగ నాగార్జున స్ప‌ష్టం చేశారు. 

Back to Top