ప‌వ‌న్‌కు సబ్‌ ప్లాన్ ఇవాళ గుర్తుకొచ్చిందా..?

చంద్రబాబు హయాంలో యథేచ్ఛగా నిధుల మళ్లింపు క‌న‌ప‌డ‌లేదా..?

రామోజీ.. ఆనాడు నీ రాతలు ఏమయ్యాయి? ఇదేనా నీ జ‌ర్న‌లిజం?

దళిత ద్రోహి చంద్రబాబును ప‌వ‌న్ ఎందుకు సమర్థిస్తున్నాడో చెప్పాలి

నిరుపేదలు, ఎస్సీ, ఎస్టీల సంక్షేమ ప్రభుత్వం మాది 

ఎక్కడా అవినీతికి తావు లేదు.. నిధుల మళ్లింపు లేదు

సబ్‌ ప్లాన్‌కు మించి పథకాల్లో నేరుగా లబ్ధి.. నగదు జమ

ఒళ్లు దగ్గర పెట్టుకోండి, వాస్తవాలు తెలుసుకొని నిజాయితీగా రాయండి

సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున 

తాడేపల్లి: రామోజీరావు వాస్తవాలు తెలుసుకుని రాతలు రాస్తే బాగుంటుందని, సబ్‌ప్లాన్‌ నిధులను చంద్ర‌బాబు పక్కదారి పట్టించినప్పుడు రామోజీరావు ఎక్కడున్నాడ‌ని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి  మేరుగ నాగార్జున ధ్వ‌జ‌మెత్తారు. రామోజీరావుకు ఇప్పుడే ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌ గుర్తొచ్చిందా..? అని ప్ర‌శ్నించారు. సబ్‌ప్లాన్‌పై రామోజీ వాస్తవాలు తెలుసుకోవాల‌న్నారు. చంద్ర‌బాబు స‌బ్ ప్లాన్ నిధులు దారిమ‌ళ్లించిన‌ప్పుడు ఈ కన్నీటి వెతలు, రాతలు ఏమయ్యాయి అని ప్ర‌శ్నించారు. అవన్నీ కడుపులో దాచుకుని, ఇవాళ చంద్రబాబును తిరిగి అధికారంలోకి తీసుకురావడం కోసం విష‌పు రాత‌లు రాస్తున్నాడ‌ని మండిప‌డ్డారు. పవన్ కళ్యాణ్‌కు సబ్‌ ప్లాన్‌ ఇవాళ గుర్తొచ్చిందా..? అని నిల‌దీశారు. రాష్ట్రంలో నిరుపేదలు, ఎస్సీ, ఎస్టీల కోసం శాచురేషన్‌ పద్ధతిలో అన్ని పథకాలు అమలు చేస్తున్న ఏకైక నాయకుడు సీఎం వైయ‌స్‌ జగన్ అని చెప్పారు. సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ద‌ళిత ప‌క్ష‌పాతిగా నిలిచార‌న్నారు. తాడేప‌ల్లిలోని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాల‌యంలో మంత్రి మేరుగ నాగార్జున విలేక‌రుల స‌మావేశం నిర్వ‌హించారు.

మంత్రి మేరుగ నాగార్జున ఇంకా ఏం మాట్లాడారంటే..

ఏ విషయం గురించి అయినా మాట్లాడేముందు అన్ని వివరాలు కూలంకశంగా తెలుసుకోవాలి. అసలు సబ్‌ప్లాన్‌ అనేది ఉందా? ముందు అది తెలుసుకో ప‌వ‌న్‌. 2014, ఆగస్టు 13న ప్రణాళిక సంఘం రద్ద‌యింది. అప్పటి నుంచి ప్రణాళిక నిధులు, ప్రణాళికేతర నిధులకు తేడా లేకుండా పోయింది. కాబట్టే ఎస్సీ కాంపోనెంట్, ఎస్టీ కాంపోనెంట్‌ను పరిగణలోకి తీసుకుంటున్నాం. రాష్ట్రంలో 2013 నుంచి 2023 వరకు చంద్రబాబు నాయుడి దత్తపుత్రుడు ఏ విధంగా రాజకీయాలు చేస్తున్నాడో అందరికీ తెలుసు. జై బాబు అనడం తప్ప, జై పవన్‌ అన్న కనీస ఆలోచన కూడా ప్రజలకు రాకుండా ఆయన రాజకీయం చేస్తున్నాడు. ఇవాళ కొత్తగా ఆయన నోట జైభీమ్‌ అన్న మాట వినిపించింది. అది చాలా వింతగా ఉంది. 

ఎందుకు సమర్థిస్తున్నాడో చెప్పాలి..
కోనసీమ జిల్లాకు అంబేడ్కర్‌ పేరు పెడితే, కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని విమర్శించిన నీచమైన సంస్కృతి ఉన్న వ్యక్తి ఆ దత్తపుత్రుడు. ఆయనకు కనీసం నైతిక విలువలు లేవు. ఒక నాయకుడు ఎవరైనా ఎదుటి వ్యక్తిపై విమర్శలు చేస్తున్నప్పుడు, తాను సమర్థించే వ్యక్తి గురించి ఆలోచించాలి. ఎస్సీ కులాల్లో పుట్టాలని ఎవరైనా అనుకుంటారా? అన్న దళిత వ్యతిరేకి, దళిత ద్రోహి చంద్రబాబు. మరి ఆయనను పవన్‌కళ్యాణ్‌ ఎందుకు అంతగా సమర్థిస్తున్నాడో చెప్పాలి. 

అవి చంద్రబాబు వెంటే ఉంటాయి..
అసలు ఎస్సీ కులాల్లో పుట్టాలని ఎవరైనా అనుకుంటారా? అన్న నేత రాజకీయాల్లో ఎలా మనుగడ కొనసాగించగలడు? చంద్రబాబు చేసిన తప్పిదాలు ప్రజలు మరువరు. కొడుకుతో పాదయాత్ర. దత్తపుత్రుడితో బస్సు యాత్ర. సమావేశాల నిర్వహణ. కానీ నీవేం చేసినా, ప్రజలు నిన్ను ఆదరించరు. చంద్రబాబు..‘ఎస్సీ కులంలో పుట్టాలని ఎవరైనా అనుకుంటారా?’ అన్న నీ మాటలు, నువ్వు దళితులకు చేసిన ద్రోహం, నీ పాపం ఎప్పుడూ నీ వెంటే ఉంటాయి. నీ కొడుకు ఎక్కడ, ఎంత పాదయాత్ర చేసినా, అవన్నీ ఆయన వెంటా నడుస్తూనే ఉంటాయి. 

రామోజీ.. ఎందుకా క్షుద్ర రాతలు..?
ఇక రామోజీ తన పత్రికతో తనకు కావాల్సిన వారి కోసమే పని చేస్తాడు. దళితులు, పేదల గురించి చంద్రబాబు ఆనాడు అంత దారుణంగా మాట్లాడితే, ఆ ఎల్లో మీడియా కురువృద్ధుడు, రాక్షసుడు ఎందుకు రాయలేదు? అదేనా రామోజీ నీ జర్నలిజమ్‌?. మరి ఎందుకు ఇప్పుడు ఆ క్షుద్ర రాతలు రాస్తున్నావు? నీకు నిజంగా నిబద్ధత ఉంటే, ఆనాడు పేదలను అవహేళన చేసిన నాయకుల గురించి ఎందుకు రాయలేదు?. రామోజీ నీకు ఇప్పుడే ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌ గుర్తొచ్చిందా? ఒక్కసారి నీ ఊరికి వెళ్లు. చంద్రబాబు హయాంలో 2014–19 మధ్య ఎలాంటి పథకాలు అందాయి? ఆ తర్వాత ఈ మూడేళ్లలో మా ప్రభుత్వ హయాంలో ఎవరికి, ఎన్ని పథకాలు అందాయి? అన్నది ఒక్కసారి చూడు. అలాగే ఆనాడు దళితులకు ఏం జరిగింది? మా హయాంలో ఎలాంటి మేలు జరుగుతుందో తెలుసుకో?

రామోజీ.. కళ్లు లేని కబోధి..
ఎందుకు కళ్లు లేని కబోధివి అయ్యావు రామోజీ. చంద్రబాబు హయాంలో 2018–19లో ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌ చూస్తే.. ఐటెం నెం.9. పొలంబడి. దాని కోసం సబ్‌ ప్లాన్‌ నిధులు ఖర్చు చేశారు. ఐటెం నెం.12. 13. చంద్రన్న రైతు క్షేత్రాలు. దాని కోసం ఎవరి డబ్బు, ఎలా ఖర్చు చేశావు? సబ్‌ ప్లాన్‌ నిధులు ఎలా మళ్లించారు? డ్వాక్రా మహిళలకు శానిటరీ నాప్కిన్స్‌. సామాజిక పెన్షన్లు.. అన్నీ ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌లో చేర్చలేదా? ఇంకా ఎన్టీఆర్‌ సుజల స్రవంతి, చంద్రన్న పెళ్లి కానుక, ఎన్టీఆర్‌ ఉద్యోగ నిధి, మా ఇంటి మహాలక్షి, పిల్లల పౌష్టికాహారం, అన్న అమృతహస్తం.. ఇవన్నీ ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌లో చేర్చలేదా?. మరి ఆరోజు నీ కన్నీటి వెతలు, రాతలు ఏమయ్యాయి? ఏమిటి నీ రాక్షసత్వం. అవన్నీ కడుపులో దాచుకుని, ఇవాళ చంద్రబాబును తిరిగి అధికారంలోకి తీసుకురావడం కోసం ఎందుకు విషపు రాతలు?

మీరెన్ని కుట్రలు చేసినా..
నీ రామోజీ ఫిల్మ్‌ సిటీ కోసం దళితుల భూమి లాక్కున్నావు. దానిపై ఎన్నో కథ‌నాలు ఉన్నాయి. చంద్రబాబు చేసిన అఘాయిత్యాలు రాయొచ్చు కదా?. సీఎం వైయ‌స్‌ జగన్‌ని ఎదుర్కోవడానికి నీ వంటి క్షుద్ర రాక్షసులు ఎన్ని కుట్రలు చేసినా, ఏ ప్రయత్నం చేసినా రాష్ట్రంలో ఉన్న ప్రజలంతా ముందుకు వచ్చి, మా నేతకు హారతులు పడతారు.

పవన్‌ వాస్తవాలు తెలుసుకో..
ఇవాళ పవన్ కళ్యాణ్‌కు సబ్‌ ప్లాన్‌ గుర్తొచ్చిందట. జనాభా ప్రాతిపదికన సబ్‌ ప్లాన్‌ను గతంలో ఎలా వినియోగించారో ఆయన తెలుసుకోవాలి. ఇప్పుడు సీఎం వైయ‌స్‌ జగన్‌ సబ్‌ ప్లాన్‌ నిధులు ఇతర అవసరాలకు ఖర్చు చేశారని ఆయన ఆరోపిస్తున్నారు. ఏదైనా మాట్లాడేటప్పుడు విషయాలు తెలుసుకోవాలి. విదేశీ విద్య పథకాన్ని ఎందుకు ఆపారో తెలుసుకో. దానిపై నిఘా విభాగం నివేదిక తెప్పించుకుని చూడు. నువ్వు ఎవరిని సీఎం చేయాలని అందరినీ తాకట్టు పెట్టాలని చూస్తున్నావో వారిని అడుగు. రాష్ట్రంలో నిరుపేదలు, ఎస్సీ, ఎస్టీల కోసం శాచురేషన్‌ పద్ధతిలో అన్ని పథకాలు అమలు చేస్తున్న ఏకైక నాయకుడు సీఎం వైయ‌స్‌ జగన్‌. వారికి ఏయే పథకాల ద్వారా ఎంత మేలు చేశారో తెలుసుకో. ఎక్కడా అవినీతికి తావు లేకుండా అన్నీ అమలు చేస్తున్నారు.

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..
అందుకే పిచ్చి రాతలు రాసే రామోజీతో సహా.. చెబుతున్నాం. ఒళ్లు దగ్గర పెట్టుకొండి. ఏదైనా రాసే ముందు వాస్తవాలు తెలుసుకోండి. నిజాయితీగా రాయండి. చేయూత పథకం. దీని వల్ల ఎవరు లబ్ధి పొందుతున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు దాని గురించి ఏనాడైనా రాశావా రామోజీ? ఆసరా వల్ల ఎందరికో మేలు కలుగుతోంది? దాని గురించి ఏనాడైనా రాశారా?. పేద కుటుంబాల పిల్లలు ఇంగ్లిష్‌ మీడియమ్‌లో చదవాలని, అలాగే నాడు–నేడు కార్యక్రమంతో ప్రభుత్వ స్కూళ్లను సమూలంగా మారుస్తున్న సీఎం పనులు కనిపించడం లేదా? ఏనాడూ వాటి గురించి రాయలేదు? పేదింటి పిల్లలను సీబీఎస్‌ఈ సిలబస్‌తో చదివిస్తున్న సీఎం అంబేడ్కర్‌ వారసుడు కాడా? ఇదే పని చంద్రబాబు ఎందుకు చేయలేదని రాస్తావా రామోజీ? అప్పుడు నీవు ఎవరి పక్షపాతి అనేది తెలుస్తుంది.

బాబుకు గడ్డి ఎందుకు పెట్టలేదు?..
చివరకు మీరు ఎంతకు దిగజారారంటే.. నిరుపేదలకు రాజధాని ప్రాంతంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే.. అక్కడ డెమొగ్రాఫికల్‌ ఇంబ్యాలెన్స్‌ వస్తుందని, కోర్టును ఆశ్రయించారు. మరి రామోజీ, పవన్‌ కళ్యాణ్‌.. మీ మాటలు ఏమయ్యాయి? రాతలు ఏమయ్యాయి? ఆనాడు చంద్రబాబుకు ఎందుకు గడ్డి పెట్టలేదు?

ఉడుత ఊపులకు చింతకాయలు రాలవు..
సీఎం వైయ‌స్ జగన్‌ దళిత పక్షపాతి. అందుకే విజయవాడ నడిబొడ్డున 125 అడుగుల అంబేడ్కర్‌ విగ్రహం ప్రతిష్టిస్తున్నారు. దాన్ని గమనించండి. కాబట్టి మీరు పెయిడ్‌ ఆర్టిస్టులతో మాట్లాడిస్తే.. మేమంతా వైయ‌స్ జగన్‌కి వ్యతిరేకులం అవుతామని అనుకోవద్దు. మేము సీఎం వైయ‌స్‌ జగన్‌తోనే ఉంటాం. మీ ఉడత ఊపులకు చింతకాయలు రాలవు.

Back to Top