బహిరంగ చర్చకు సిద్ధం

ఉచిత విద్యుత్‌ గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు

వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు

తాడేపల్లి: రైతుల కోసం దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి ఒక అడుగు ముందుకేస్తే.. ఆయన తనయుడు సీఎం వైయస్‌ జగన్‌ రెండు అడుగులు ముందుకేస్తున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. ఉచిత విద్యుత్‌ గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదన్నారు. మంత్రి కన్నబాబు మీడియాతో మాట్లాడుతూ.. విద్యుత్‌ చార్జీలు తగ్గించమని బషీర్‌బాగ్‌లో ఆందోళన చేస్తున్న రైతులపై కాల్పులు జరిపిన నీచచరిత్ర చంద్రబాబుదని గుర్తుచేశారు. చంద్రబాబు అబద్ధాలకు అంతేలేకుండా పోయిందని మండిపడ్డారు. ఉచిత విద్యుత్‌పై టీడీపీ నేతలతో బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నానని, దమ్ముంటే చర్చకు రావాలని సవాల్‌ విసిరారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకువచ్చిన ఉచిత విద్యుత్‌ నగదు బదిలీ పథకం ద్వారా రైతులకు మేలు జరుగుతుందన్నారు. విద్యుత్‌ కోసం రైతు ఒక్క పైసా కట్టాల్సిన అవసరం లేదని చెప్పారు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top