చంద్రబాబు నిర్మాతగా ఎల్లోమీడియాలో రోజుకో విషప్రచారం

అబద్ధాలు, దుష్ప్రచారాలకు పేటెంట్‌ హక్కు చంద్రబాబుది

దళితులపై దాడులు చేసింది టీడీపీ నేతలే

పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని ధ్వజం

కృష్ణా: దుష్ప్రచారం చేస్తూ ప్రభుత్వంపై బురదజల్లాలని చంద్రబాబు కుట్రలు చేస్తున్నాడని పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని ధ్వజమెత్తారు. చంద్రబాబు నిర్మాతగా రామోజీరావు, ఏబీఎన్‌ రాధాకృష్ణ, టీవీ5 బీఆర్‌ నాయుడు దర్శకత్వంలో రోజూ మనకు మహాద్భుతమైన సినిమాను చూపిస్తున్నారని మండిపడ్డారు. మంత్రి కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ.. దళితులపై దాడులు చేసింది టీడీపీ నేతలేనని, పనిగట్టుకొని ప్రభుత్వంపై బురదజల్లాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత టీడీపీ పాలనలో దళితులపై దాడులు చేయించి, వారిని అవమానించే విధంగా మాట్లాడిన చంద్రబాబు దళిత ద్రోహిగా మిగిలిపోయాడన్నారు. 

దళితులకు ద్రోహం జరుగుతుందని టీవీ ఛానల్స్‌లో డిబేట్‌లు పెడుతున్నారని,  ఎందుకూ పనికిరాని కొంతమంది టీడీపీ నేతలు టీవీల్లో విషపూరిత ఉపన్యాసాలు ఇస్తున్నారని మంత్రి కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. అబద్ధాలు, దుష్ప్రచారాలకు పేటెంట్‌ హక్కు చంద్రబాబుదేనని స్పష్టం చేశారు. కోర్టుల్లో కేసులు వేసి ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని అడ్డుకుంది చంద్రబాబు కాదా..? అని ప్రశ్నించారు. త్వరలోనే మహిళల పేర్లపై రిజిస్ట్రేషన్లు చేసి ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తామన్నారు. సీఎం వైయస్‌ జగన్‌ అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నారని,  సంక్షేమ కార్యక్రమాల కోసం ఇప్పటి వరకు రూ.60 వేల కోట్లకు పైగా ఖర్చు చేశారని వివరించారు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top