కే.కన్వేషన్‌లో క్యాసినో జరగలేదు

మంత్రి కొడాలి నాని

రాష్ట్రంలో క్లబ్‌లన్నీ మూసేసిన చరిత్ర సీఎం వైయస్‌ జగన్‌ది

విజయవాడ:  గుడివాడ పట్టణంలోని కే.కన్వేషన్‌లో క్యాసినో జరగలేదని మంత్రి కొడాలి నాని స్పష్టం చేశారు. క్యాసినో పెట్టినట్లు నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తానని టీడీపీ నేతలకు మంత్రి సవాలు విసిరారు. పక్కా ప్లాన్‌ ప్రకారం తనపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బ్లాక్‌ మెయిల్‌ రాజకీయాలకు చంద్రబాబు పెట్టింది పేరని విమర్శించారు. క్యాసినో జరగలేదని ఆధారలు ఉన్నప్పుడు నిజనిర్ధారణ కమిటీ ఎందుకని ప్రశ్నించారు. టీడీపీ హయాంలో నియోజకవర్గానికి ఒక క్లబ్‌ నడిపిన చరిత్ర చంద్రబాబుదన్నారు. రాష్ట్రంలో క్లబ్‌లన్నీ మూసేసిన చరిత్ర సీఎం వైయస్‌ జగన్‌దని పేర్కొన్నారు. టీడీపీ నేతలు చేసిన ఆరోపణలు నిరూపించాలని, లేదంటే నా దగ్గర ఉన్న సీసీ ఫుటేజ్‌లు విడుదల చేస్తానని మంత్రి హెచ్చరించారు.
 

తాజా ఫోటోలు

Back to Top