చంద్రబాబు ఈనాడు ఉద్యోగి

40 ఏళ్ల అనుభవం ఉన్న వ్యక్తి ఇలాగేనా వ్యవహరించేది?

అక్రమ కేసులతో వైయస్‌ జగన్‌ను అణచివేయాలని కుట్రలు పన్నారు

ఓ వ్యక్తిగా వచ్చిన వైయస్‌ జగన్‌ వ్యవస్థను క్రియేట్‌ చేశారు

చంద్రబాబు టీడీపీ అనే వ్యవస్థలోకి దూరి పందికొక్కులా నాశనం చేశారు

మంత్రి కొడాలి నాని

అసెంబ్లీ: తప్పుడు పనులు చేసేందుకు ఎన్టీఆర్‌ ఉపయోగపడరని చంద్రబాబును ఈనాడు లాంటి కొన్న సంస్థలు ఉద్యోగిగా పెట్టుకున్నాయని మంత్రి కొడాలి నాని విమర్శించారు. వైయస్‌ జగన్‌ 35 ఏళ్ల వయసులో పార్టీ పెట్టి ఒక వ్యవస్థను క్రియేట్‌ చేశారని, చంద్రబాబు టీడీపీ అనే వ్యవస్థలోకి పందికొక్కులా దూరి నాశనం చేశారని మండిపడ్డారు. అసెంబ్లీలో శుక్రవారం ఆయన మాట్లాడారు. 
చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడు..ఆయనకు రావడానికి ప్రత్యేక గేట్‌ ఉంది. ఆయన ఉద్దేశపూర్వకంగా కారు దిగి ఎమ్మెల్యేలు వచ్చే గేటు వద్దకు  వెళ్లి అక్కడ ఉన్న టీడీపీ ఎమ్మెల్యేలతో పాటు టీడీపీ కార్యకర్తలను వంద మందిని తీసుకొని ప్లేకార్డ్స్‌, బ్యానర్స్‌ తీసుకొని సభలోకి వస్తుంటే ..వీళ్లలో ఎవరు సభ్యులు, ఎవరు కాదో అన్న అనుమానంతో మార్షల్స్‌ గేట్లు వేసి ఒక్కొక్కరిని లోపలికి పంపిస్తున్నారు.  అయితే చంద్రబాబు, లోకేష్‌ ఇద్దరూ కలిసి మార్షల్స్‌పై దుర్భాషలాడి మార్షల్స్‌ రొమ్ములపై చేయ్యి వేసి తోశారు. అడ్డగోలుగా దాడి చేశారు. వీళ్లు లోపలికి వచ్చి డ్రామాలాడుతున్నారు. చంద్రబాబును ఆపేశారని గోళ చేస్తున్నారు. చంద్రబాబు నేరుగా కారులో వచ్చి ముఖ్యమంత్రి దిగే ప్రాంతంలో ఆయన కూడా రావచ్చు. ప్రతి రోజు బ్లాక్‌ క్యాట్స్‌తో వచ్చి ఇక్కేడే దిగేవారు. ఉద్దేశపూర్వకంగా కావాలనే ఎమ్మెల్యేలు వచ్చే గేట్‌లోనికి వచ్చారు. సభ్యులు కాని వారు లోపలికి వస్తే మార్షల్స్‌ ఉద్యోగాలు పోవా? చంద్రబాబు బుద్ధిలేని పని చేశారు. రామానాయుడు అంటున్నారు..జగన్‌ 16 నెలలు జైల్లో ఉన్నారని అంటున్నాడు. వీళ్లు చెప్పకపోతే రాష్ట్ర ప్రజలకు తెలియదా? ఒక్కటే చెబుతున్నాను. నీతిగా, నిజాయితీగా కాంగ్రెస్‌ పార్టీని వ్యతిరేకించారు కాబట్టే అక్రమంగా జైల్లో పెట్టారు. ఆ తరువాత ప్రజలు వైయస్‌ జగన్‌కు ప్రతిపక్ష హోదా ఇచ్చారు. ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. కేవలం 35 ఏళ్ల వయసులో మూడు నెలలు ఎంపీ పదవిలో ఉన్న వ్యక్తి ఒక పార్టీ పెట్టి, ఒక వ్యక్తిగా ప్రారంభమైన, వ్యవస్థను రూపొందించి..ఇవాళ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. ఆ రోజుల్లో ఎన్టీ రామారావుకు ఇలాంటిది సాధ్యమైంది. ఇవాళ 35 ఏళ్ల వయసులోనే 151 సీట్లతో ఇంత పెద్ద మెజారిటీతో ముఖ్యమంత్రి అయ్యారు. సిగ్గులేని టీడీపీ నేతలు వైయస్‌ జగన్‌ను విమర్శిస్తున్నారు. వీళ్లు ఎన్ని కేసుల్లో స్టేలు తెచ్చుకున్నారో తెలియదా?.
 నిన్న చంద్రబాబు అంటారు..ఈనాడు పేపర్‌ 1978లో పెట్టారు. మేం 1983లో టీడీపీ స్థాపించామన్నారు. ఎన్టీఆర్‌ పార్టీ పెట్టినప్పుడు పేపర్‌ మీద ఆధారపడలేదు. 60 వేల సర్క్యూలేషన్‌ ఉన్న పేపర్‌ 3 లక్షలకు వచ్చింది.  ఎన్టీఆర్‌ ఈనాడుకు ఉపయోగపడ్డాడు కానీ, ఈనాడు ఎన్టీఆర్‌కు ఉపయోగపడలేదు. 10 మంది ఎమ్మెల్యేలు కూడా లేకుండా వైశ్రాయ్‌ హోటల్‌లో 165 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని ఈనాడులో రాయించుకున్నాడు.  ఈనాడు సంస్థలో చంద్రబాబు ఓ ఉద్యోగి. తప్పుడు పనులు చేయడానికి ఎన్టీఆర్‌ ఉపయోగపడరని తెలిసి ఇటువంటి సంస్థలన్నీ కూడా కలిసి చంద్రబాబును ఉద్యోగిగా పెట్టుకున్నాయి. టీడీపీ అనే వ్యవస్థలోకి దూరి పందికొక్కులా నాశనం చేసిన వ్యక్తి చంద్రబాబు. ఒక వ్యక్తిగా బయటకు వచ్చి ఒక వ్యవస్థను క్రియేట్‌ చేసిన వ్యక్తి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి. కాబట్టి ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి.

Read Also:మార్షల్స్‌కు చంద్రబాబు క్షమాపణ చెప్పాల్సిందే

తాజా ఫోటోలు

Back to Top