న‌కిలీ మ‌ద్యంపై మ‌హిళ‌ల నిర‌స‌నాగ్ర‌హం

వైయ‌స్ఆర్‌సీపీ మ‌హిళా విభాగం ఆధ్వ‌ర్యంలో ఆందోళ‌న‌లు

ఎక్సైజ్ కార్యాల‌యాల ఎదుట మ‌ద్యం బాటిళ్ల‌తో నిర‌స‌న‌, బాటిల్స్ ధ్వంసం

తాడేప‌ల్లి:   న‌కిలీ కల్తీ మ‌ద్యాన్ని అరిక‌ట్టాల‌ని డిమాండ్ చేస్తూ రాష్ట్ర‌వ్యాప్తంగా వైయ‌స్ఆర్‌సీపీ మ‌హిళా విభాగం ఆధ్వ‌ర్యంలో ఆందోళ‌నలు చేప‌ట్టారు.  ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ కార్యాలయం ఎదుట వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ మహిళా  విభాగం నాయకురాళ్లు, కార్యకర్తలు మ‌ద్యం సీసాల‌తో నిర‌స‌న వ్య‌క్తం చేస్తూ..వాటిని రోడ్డుపై ప‌గుల‌గొట్టారు.  కల్తీ మద్యం సీఎం డౌన్ డౌన్ అంటూ, నారా వారి సారాను అరికట్టాలి అంటూ మ‌హిళ‌లు నిన‌దించారు. తిరుప‌తి న‌గ‌రంలో న‌కిలీ మ‌ద్యం సూత్ర‌దారులు, పాత్ర‌దారుల‌ను వెంటనే అరెస్ట్ చేయాలని మ‌హిళా నాయ‌కురాళ్లు డిమాండ్ చేశారు.

గుంటూరు జిల్లా: 
గుంటూరు ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయం ఎదుట  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా ఆధ్వర్యంలో ధర్నా నిర్వ‌హించారు. తెలుగుదేశం నాయకులు నకిలీ మద్యం తయారు చేయడానికి నిరసిస్తూ మద్యం బాటిల్ ధ్వంసం చేశారు. ఈ సంద‌ర్భంగా నూరి ఫాతిమా మాట్లాడుతూ..`తెలుగుదేశం నాయకులు నకిలీ మద్యం తయారీ ని కుటీర పరిశ్రమలు గా తయారు చేసుకున్నారు. రాష్ట్రంలో విద్య వైద్యాన్ని నిర్వీర్యం చేసి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మధ్యాన్ని ఏరులై పారిస్తోంది. తెలుగుదేశం నాయకులు ప్లాంట్లు పెట్టి మరి నకిలీ మద్యాన్ని తయారు చేస్తున్నారు. నకిలీ మద్యం తాగి ఇప్పటికీ ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. నకిలీ మద్యం మరణాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఇవన్నీ ప్రభుత్వ హత్యలే` అని ఫాతిమా మండిప‌డ్డారు.

విజయవాడ :

ఎన్టీఆర్ జిల్లా ఎక్సైజ్ కార్యాలయం ఎదుట వైయ‌స్ఆర్‌సీపీ  మహిళా విభాగం ఆధ్వర్యంలో నిరసన కార్య‌క్ర‌మం చేప‌ట్టి మ‌ద్యాన్ని పార‌బోశారు.  కల్తీ మద్యాన్ని అరికట్టాలని డిమాండ్ చేశారు.

కర్నూలు:
కర్నూలు ఎక్సైజ్ కార్యాలయం ఎదుట వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో నిరసన కార్య‌క్ర‌మం చేప‌ట్టారు.  కల్తీ మద్యంతో  ప్రాణాలు తీస్తున్న కూటమి ప్రభుత్వంపై  వైయ‌స్ఆర్‌సీపీ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్తీ మద్యాని విక్రయాలను నిరసిస్తూ మద్యం బాటిల్స్ పగలకొట్టి నిరసన తెలిపారు. తక్షణమే కల్తీ లిక్కర్ ను అరికట్టాలని, మద్యాన్ని బెల్టు షాపులు తొలగించాలని మ‌హిళా విభాగం రాష్ట్ర వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్వీ విజ‌య మ‌నోహ‌రి డిమాండ్ చేశారు.

అనంతపురం:

కల్తీ మద్యంపై మహిళలు, యువకుల ఆగ్రహం వ్య‌క్తం చేస్తూ న‌గ‌రంలో నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న చేప‌ట్టారు. అనంత‌రం అనంతపురం ఎక్సైజ్ డీసీ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వ‌హించారు. మద్యం బాటిళ్లు ధ్వంసం చేసి మహిళలు, యువకులు నిర‌స‌న వ్య‌క్తం చేశారు. కల్తీ మద్యం తయారు చేసే టీడీపీ నేతల పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కల్తీ మద్యం అరికట్టండి... పేదల ప్రాణాలు కాపాడాలంటూ నిన‌దించారు.

Back to Top