బాణసంచా పేలుడు ఘ‌ట‌న‌పై వైయ‌స్ జ‌గ‌న్ దిగ్భ్రాంతి

మృతుల కుటుంబాల‌ను ప్ర‌భుత్వం ఉదారంగా ఆదుకోవాలి

తాడేప‌ల్లి:  డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్ కోనసీమ జిల్లాలో బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు ఘటనపై వైయ‌స్ఆర్‌సీపీ  అధ్య‌క్షుడు, మాజీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. ఈ ఘ‌ట‌న‌ లో పలువురు మరణించడం అత్యంత విషాదకరమని అన్నారు. రాయవరంలో జరిగిన ఘటన అత్యంత దిగ్భ్రాంతిని కలిగించిందని విచారం వ్య‌క్తం చేశారు. మరణించిన వారి కుటుంబాలకు ఆయన ప్రగాఢ సంతాపం ప్రకటించారు. మృతుల కుటుంబాలను ఉదారంగా ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పలువురు క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించి, ప్రభుత్వం ఆదుకోవాలన్నారు.

Back to Top