ఇబ్బందులు పెట్టేవారిని వదలం 

కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి హెచ్చ‌రిక‌

ద‌గ‌ద‌ర్తి మండలంలో డిజిట‌ల్ బుక్ క్యూఆర్ కోడ్ పోస్ట‌ర్ ఆవిష్క‌ర‌ణ‌

నెల్లూరు జిల్లా: రాష్ట్రంలో వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలను, నాయకులను ఇబ్బందులకు గురి చేస్తున్న వారిని వదిలి పెట్టబోమని కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి హెచ్చ‌రించారు. బుధ‌వారం కావలి నియోజకవర్గ దగదర్తి మండలం మనుబోలుపాడు గ్రామంలో డిజిటల్ బుక్ క్యూఆర్ కోడ్ పోస్ట‌ర్‌ను ఆయ‌న ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా రామిరెడ్డి ప్ర‌తాప్ కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వైయ‌స్ఆర్‌ సీపీ కార్యకర్తలపై దాడులు పెరిగి పోయాయన్నారు. ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసి, సమస్యలపై ప్రశ్నిస్తున్న వారిపై అక్రమ కేసులు పెడుతున్నారని తెలిపారు. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు. పార్టీ అధినేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి కార్యకర్తల కోసం డిజిటల్‌ బుక్‌ క్యూఆర్‌ కోడ్‌ తీసుకొచ్చారని, ఎవరికి ఏ అన్యాయం జరిగినా సమస్యతో పాటు ఇబ్బంది పెట్టిన వారి వివరాలు, ఫొటోలు, సమాచారం నమోదు చేయాలని సూచించారు. ఈ వివరాలు నేరుగా అధినేత వైయ‌స్‌ జగన్‌ దృష్టికి వెళ్తాయని, ఇబ్బంది పెట్టిన వ్యక్తులు ఎంతటి వారైనా వదిలి పెట్టేది లేదని స్పష్టం చేశారు.  సోషల్‌ మీడియా యాక్టివిస్ట్‌ను అరెస్టు చేసి, చేయలేదంటూ పోలీసులు చెప్పడంపై హైకోర్టు న్యాయమూర్తులు సీబీఐ ఎంక్వైరీకి ఆదేశించారన్నారు.  కార్య‌క్ర‌మంలో దగదర్తి మండల  కన్వీనర్  మహేష్ నాయుడు, ఉపాధ్యక్షుడు చింతల బోయిన వెంకటేశ్వర్లు, తాళ్లూరు రాజశేఖర్ , యూత్ కన్వీనర్ వట్టికాళ్ల మాధవరావు, నాయ‌కులు కలవకూరు శ్రీనివాసులు  రెడ్డి, చేజర్ల మోహన్ రెడ్డి, వెలం సుబ్బారావు, ఆత్మకూరు గిరి నాయుడు, భీమిరెడ్డి మధు రెడ్డి, బొడ్డు భాస్కర్ రెడ్డి,  త‌దిత‌రులు పాల్గొన్నారు.

Back to Top