అన్నమయ్య జిల్లా: ప్రజల ఆరోగ్యాన్ని వ్యాపారంగా మార్చే కూటమి ప్రభుత్వ కుట్రలను కోటి సంతకాలతో తిప్పికొట్టాలని వైయస్ఆర్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి పిలుపునిచ్చారు. చిన్నమండెం మండలం కేసాపురం, పొలిమేరపల్లె, బోనమల గ్రామాల ప్రజలు, వైయస్ఆర్ సీపీ కార్యకర్తలు, నాయకులుతో నిర్వహించి న రచ్చబండ – కోటి సంతకాల సేకరణ కార్యక్రమాలలో రాష్ట్ర కార్యదర్శి దేవనాధ రెడ్డి, మండల కన్వీనర్ గోవర్ధన్ లతో కలసి వైయస్ఆర్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన “కోటి సంతకాల ఉద్యమానికి రాష్ట్ర వ్యాప్తంగా విశేష ఆదరణ పొందుతోందన్నారు. ప్రజల ఆరోగ్యంపై వ్యాపారం చేయొద్దు – ప్రభుత్వ కళాశాలలు ప్రజల సొత్తు... ఆరోగ్యాన్ని హక్కుగా భావించి పేద విద్యార్థులకు వైద్య విద్యను అందించాలన్న దృష్టితో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి స్థాపించిన 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలలు పేదల భవిష్యత్తుకు మార్గదర్శకం అయ్యాయన్నారు. ఇప్పుడు ఆ కళాశాలలను ప్రైవేట్ వర్గాలకు అప్పగించాలన్న కూటమి ప్రభుత్వ యత్నం పేదల వైద్య హక్కుపై దాడి” అని మండిపడ్డారు.ప్రజల ఆరోగ్యాన్ని వ్యాపారం చేయొద్దు. ప్రభుత్వ మెడికల్ కళాశాలలు ప్రజల సొత్తు అని ఆయన అన్నారు. వాటిని అమ్ముకోవడం పాపమన్నారు. ప్రజలే ఈ దురాలోచనను అడ్డుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజల అభిప్రాయమే ఆయుధం – గవర్నర్‌కు కోటి సంతకాల విన్నపం ప్రభుత్వ వైద్య విద్యా వ్యవస్థను ప్రైవేటీకరించాలన్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతోందని ఆయన తెలిపారు. “కోటి మంది ప్రజల సంతకాల రూపంలో గవర్నర్‌కు విన్నవించడం జరుగుతుందన్నారు. ఆరోగ్యశ్రీ నిర్వీర్యం – పేదల వైద్య సేవలకు తాళం వేసిన కూటమి ప్రభుత్వం... ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకాన్ని బీమా కంపెనీలకు అప్పగించడమే పేదల వైద్య హక్కుపై పెద్ద దెబ్బ అని శ్రీకాంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రూ. 2,700 కోట్ల బకాయిలు చెల్లించక పోవడంతో నెట్‌వర్క్ ఆసుపత్రులు సేవలు నిలిపివేశాయన్నారు.పేద రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. బీమా కంపెనీల స్వలాభం కోసం ప్రజల ప్రాణాలను పణంగా పెట్టడం క్షమించరానిద ని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యకర్తలే పార్టీ స్థంభాలు... అన్యాయం జరిగితే సహించం.. కార్యకర్తలే పార్టీ యొక్క స్థంభాలన్నారు. ఎవరికైనా అన్యాయం జరిగితే, పార్టీ పూర్తిగా వారి వెనుక నిలుస్తుందని,కార్యకర్తల సమస్యల పరిష్కారంలో రాజీకి చోటు లేదని, తోడుగా నిలుస్తామన్నారు .పార్టీ కమిటీల బలోపేతం, అన్ని సామాజిక వర్గాల ప్రతినిధులకు సమాన అవకాశాల కల్పన, గుర్తింపు కార్డుల పంపిణీ తదితర అంశాలపై ఆయన దిశానిర్దేశం చేశారు. పార్టీని కుటుంబంగా భావించి ముందుకు సాగుదాం...పార్టీ కమిటీ లను బలోపేతం చేసుకుందాం.. ప్రజలతో, కార్యకర్తలతో పేరుపేరునా మాట్లాడిన శ్రీకాంత్ రెడ్డి, వారి నిబద్ధత, విశ్వాసం పట్ల హర్షం వ్యక్తం చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒక కుటుంబమని, మనందరం కలిసి పేదల కోసం, ప్రజల కోసం, న్యాయం కోసం కదలాలని, కార్య కర్తలకు ఏ కష్టం వచ్చినా నేనే ముందుంటాఅని హామీ ఇచ్చారు. వైయస్ జగన్ పాలనలో ఇంటింటికీ సంక్షేమం: వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర కార్యదర్శి దేవనాధరెడ్డి జగన్ పాలనలో ఇంటింటికీ సంక్షేమ పథకాలు అందాయని వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర కార్యదర్శి దేవనాధరెడ్డి పేర్కొన్నారు. రచ్చబండ కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని మండలంలో విజయవంతం చేద్దామన్నారు. మండల కన్వీనర్ గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై 16 నెలల పాలనలోనే తీవ్ర వ్యతిరేఖత వచ్చిందన్నారు. ఆత్మీయ స్వాగతాలు... కార్యక్రమాలకు విచ్చేసిన శ్రీకాంత్ రెడ్డి, దేవనాధ రెడ్డి, గోవర్ధన్ రెడ్డిలకు ఆయా గ్రామాల ప్రజలు ఘన స్వాగతం పలికారు. గజమాలలు కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో వైయస్ఆర్ సీపీ మండల నాయకులు బాబు రెడ్డి, సర్పంచులు లోకేశ్వర్ రెడ్డి, అఫ్రోజ్, సుధాకర్, ఎంపీటీసీలు రెడ్డెప్ప, వెంకటప్ప నాయుడు, మండల బీసీ అధ్యక్షుడు శేఖర్ (JCB ),మండల జెసిఎస్ కన్వీనర్ చుక్కా అంజనప్ప, వైఎస్ఆర్ సీపీ నాయకులు సీతాపతి రెడ్డి, నాగ శేషా రెడ్డి, చంద్రపాల్ రెడ్డి, నర్సరీ రమణ, ఆనంద్ రెడ్డి, భాస్కర్ నాయుడు, ఖాజా ముద్దీన్, మస్తాన్, రహంతుల్లా, అలీజన్, మురళి, రాజు, బుడ్డయ్య, లోకేష్, పవన్, రామచంద్ర, విజయ్, రమేష్, గురు దేవా, నాగిరెడ్డి, రెడ్డెప్ప రెడ్డి, రామాంజులు రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, సుబ్బయ్య తదితర పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.