సీఎం వైయస్‌ జగన్‌ పాలనలో పోలీసులకు వీక్లీఆఫ్‌

పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని
 

గుడివాడ: పోలీసుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  తొలిసారిగా పోలీసులకు వీక్లీఆఫ్‌లు ప్రకటించారని పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా గుడివాడలోని డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఓపెన్‌ హౌస్‌ను మంత్రి కొడాలి నాని ప్రారంభించారు. జిల్లా ఎస్పీ రవీంద్ర బాబు ఆధ్వర్యంలో గుడివాడ పోలీసులు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు ఘనంగా నిర్వహించటం సంతోషకరమన్నారు. పోలీసు అధికారులు, సిబ్బంది, విద్యార్థులు స్వచ్ఛందంగా ఈ వారోత్సవాల్లో రక్తదానం చేయడం అభినందనీయమన్నారు. సమాజానికి ఏదొక మేలు చేయాలన్న పోలీసు శాఖ సంకల్పం అభినందనీయమన్నారు. పోలీసులు వారి కుటుంబాలను సైతం వదిలి సమాజ శ్రేయస్సు కోసం పనిచేసే శాఖ పోలీసు శాఖ.. ప్రతి ఏడాది పోలీసు అమరవీరుల దినోత్సవాన్ని ద్వారా అమరులైన పోలీస్‌ సిబ్బందిని గుర్తు చేసుకోవడం నిజమైన నివాళి అన్నారు. విద్యార్థులకు పోలీసు శాఖ ఉపయోగించే ఆయుధాలను ఓపెన్‌ హౌస్‌ కార్యక్రమం ద్వారా ఆయుధాలు గురించి  తెలియజేయడం మంచి పరిణామం అన్నారు.

Read Also: గతంలో మీడియాపై ఆంక్షలు పెట్టిందెవరు?

Back to Top