తాడేపల్లి: ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో రేపు(బుధవారం) జరిగే ర్యాలీలను సూపర్ సక్సెస్ చేద్దామని వైయస్ఆర్‌సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. నాడు వైయస్ జగన్ వైద్య విప్లవం తీసుకొస్తే.. నేడు చంద్రబాబు నిర్వీర్యం చేశారు. వైద్యవిద్యార్ధుల కలలను సాకారం చేయాలన్న గొప్ప సంకల్పం వైయస్ జగన్ గారిది అని తెలిపారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల విషయంలో తెలంగాణను చూసైనా చంద్రబాబు బుద్దితెచ్చుకోవాలని సూచించారు. వైద్య వ్యవస్ధను నిర్వీర్యం చేసిన కూటమి ప్రభుత్వానికి గుణపాఠం చెబుదాం, ప్రజా స్పందనను బలంగా వినిపిద్దామని సజ్జల రామకృష్ణారెడ్డి దిశానిర్దేశం చేశారు. మంగళవారం పార్టీ ఎంపీటీసీలు, పార్లమెంట్ పరిశీలకులతో సజ్జల రామకృష్ణారెడ్డి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రసంగించిన సజ్జల రామకృష్ణారెడ్డి ఏమన్నారంటే... ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రేపు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరిగే ర్యాలీలను సూపర్ సక్సెస్ చేసి చంద్రబాబు ప్రభుత్వం దిగివచ్చేలా చేద్దాం. అప్పుడే పేదలకు మెరుగైన వైద్యం, మన విద్యార్ధుల వైద్య విద్య కలలు సాకారం అవుతాయి. కానీ చంద్రబాబు ప్రభుత్వం కుట్రపూరితంగా వైద్య విద్యార్ధుల కలలకు గండికొట్టింది. మన నాయకుడు జగన్ గారు అధికారం చేపట్టిన తర్వాత ఒకేసారి ఏకంగా 17 కొత్త వైద్య కళాశాలలకు శ్రీకారం చుట్టి 5 మెడికల్ కాలేజీలను కూడా ప్రారంభించారు. ఒకపక్క తెలంగాణలో భవనాలు లేకపోయినా అనుమతులు తెచ్చుకుని మెడికల్ కాలేజీలు నిర్వహిస్తుంటే ఏపీలో దాదాపుగా అన్ని వసతులతో కాలేజీలు సిద్దం చేశారు, చంద్రబాబు కొత్త మెడికల్ కాలేజీలు తీసుకురాకపోగా ఉన్న వాటిని ప్రైవేట్ పరం చేయాలని కుట్రపన్నారు. కోటి సంతకాల సేకరణ కోసం క్షేత్రస్ధాయిలో మీరంతా ఉన్నారు, ఇదంతా కూడా ఒక ప్రజా ఉద్యమంగా కొనసాగుతోంది. మీ అందరి భాగస్వామ్యం వల్ల కోటి సంతకాల సేకరణ రచ్చబండ కార్యక్రమం విజయవంతం అవుతుంది. చంద్రబాబు ప్రభుత్వం అన్ని పథకాలు నిర్వీర్యం చేసింది, ప్రజలకు ఎలాంటి సంక్షేమ పథకాలు అందడం లేదు. అన్ని రంగాలు కుదేలయ్యాయి. జగన్ గారి పాలనలో అన్నీ చెప్పిన ప్రకారం ఇచ్చిన ప్రభుత్వాన్ని చూస్తే ఇప్పుడు అంతా కుదేలైన పరిస్ధితి, రైతుల పరిస్ధితి దయనీయంగా మారింది, విచ్చలవిడిగా అవినీతి పెరిగిపోయింది. చంద్రబాబు ప్రభుత్వంపై దేశంలో ఏ ప్రభుత్వంపై లేనంత వ్యతిరేకత వచ్చింది. రేపటి ర్యాలీలకు పార్టీలకు అతీతంగా కలిసిరావాలి, విద్యార్ధులు, తల్లిదండ్రులు, ప్రజాసంఘాలు, మేధావులు, సామాజిక కార్యకర్తలతో ర్యాలీలు విజయవంతం అవ్వాలి. మనం చేసే ఆందోళనలు, ర్యాలీలు జాతీయస్ధాయిలో చర్చ జరిగేలా ఉండాలి. అప్పుడే చంద్రబాబు ప్రభుత్వం దిగివస్తుంది. సోషల్ మీడియా, డిజిటల్ మీడియాను విస్తృతంగా వినియోగించుకుందాం. స్ధానిక సంస్ధల ఎన్నికలు ఎప్పుడొచ్చినా మీరంతా సిద్దంగా ఉండాలి, దీనిపై కూడా సీరియస్‌గా దృష్టిపెట్టాలి. క్షేత్రస్ధాయి నుంచి పార్టీ కమిటీలు, అనుబంధ విభాగాల కమిటీల నియామకంపై ప్రత్యేక దృష్టిపెట్టాలి. బూత్ లెవల్ ఏజెంట్లను పక్కాగా నియమించుకోవాలి. ఇదంతా పారదర్శకంగా డిజిటలైజేపన్ చేయాలి. కేంద్ర కార్యాలయం నుంచి అవసరమైన సహకారం ఉంటుంది. అన్ని నియోజకవర్గాల్లో డిజిటల్ మేనేజర్లను కూడా నియమించడం జరిగింది. కమిటీల ఏర్పాటు పకడ్భందీగా చేయాలి, డేటా అంతా కూడా డిజిటలైజ్ చేయాలి. మన హయాంలో ప్రజలకు జరిగిన మంచిని, చంద్రబాబు చేస్తున్న దుర్మార్గాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళదాం.