తాడేపల్లి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఎల్లుండి (04.03.2026) విశాఖపట్నం,అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో పర్యటించనున్నారు. బుధవారం ఉదయం 11.30 గంటలకు ఆయన అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు వ్యాలీకి చేరుకుంటారు. తంగుల్‌గూడా గ్రామంలోని రాధాకృష్ణ ఆలయంలో నిర్వహించనున్న ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం కుమారుడి వివాహ వేడుకకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 1.30 గంటలకు విశాఖపట్నం చేరుకుని రాణాప్రతాప్ నగర్‌లోని మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ నివాసానికి వెళ్లనున్నారు. ఇటీవల వివాహం చేసుకున్న నూతన వధూవరులను ఆశీర్వదించిన అనంతరం అక్కడి నుంచి తిరుగు ప్రయాణం ప్రారంభిస్తారు. 5న ప్రొద్దుటూరుకు వైయస్ జగన్ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం (05.03.2026) వైయస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరులో పర్యటించనున్నారు. ఉదయం 11.30 గంటలకు ప్రొద్దుటూరు చేరుకుని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి కుమార్తె వివాహ రిసెప్షన్ వేడుకకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించనున్నారు. వివాహ కార్యక్రమం అనంతరం మధ్యాహ్నం అక్కడి నుంచి తిరుగు పయనమవుతారు. ఈ పర్యటనలో స్థానిక పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొననున్నారు.