అనంతపురం : భారత స్వాతంత్ర సమరయోధుడు, తొలి కేంద్ర విద్యాశాఖ మంత్రి & భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ 138 వ జయంతిని పురస్కరించుకొని అనంతపురం వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయం పార్టీ జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి పార్టీ శ్రేణులతో కలిసి మౌలానా అబుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం టవర్ క్లాక్ వద్దనున్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ విగ్రహానికి నివాళులర్పించారు.