తాడిపత్రి : జేసీ వర్గీయులు దాడిలో గాయపడిన వైయస్ఆర్‌సీపీ నేత ఓబుళరెడ్డిని పార్టీ సీనియర్ నేత, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మంగళవారం పరామర్శించారు. ఉదయం వాకింగ్‌కు వెళ్లిన ఓబుళరెడ్డిపై దాడి చేసి ముళ్లకంపలో పడేశారని ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో గాయపడిన ఓబుళరెడ్డిని ఆస్పత్రిలో పరామర్శించారు.