స్కిల్‌ స్కామ్‌ కేసు మూసివేత అత్యంత హేయం

పరాకాష్టకు చంద్రబాబు అధికార దుర్వినియోగం

ఎస్వీ సతీష్‌కుమార్‌రెడ్డి ధ్వజం

వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్‌కుమార్‌రెడ్డి

డొల్ల కంపెనీలకు రూ.371 కోట్లు మళ్లింపు

అక్కణ్నుంచి నేరుగా చంద్రబాబు ఖాతాలోకి

ఆధారాలతో సహా దొరికిపోయిన చంద్రబాబు

తిరిగి అధికారంలోకి రాగానే అటకెక్కిన కేసులు

ఒక్కొక్కటిగా మూసి వేయించుకుంటున్న బాబు

ఎస్వీ సతీష్‌కుమార్‌రెడ్డి ఆక్షేపణ

రాయలసీమకు చంద్రబాబు తీరని ద్రోహం

లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీమ్‌కు మంగళం దారుణం

రాయలసీమ ప్రాజెక్టుల్లో ఏ పనీ చేయని బాబు

మరి రూ.8 వేల కోట్లు ఎక్కడ ఖర్చు చేశారు?  

ప్రెస్‌మీట్‌లో ఎస్వీ సతీష్‌కుమార్‌రెడ్డి సూటి ప్రశ్న

తాడేపల్లి: స్కిల్‌ స్కామ్‌లో పక్కా ఆధారాలతో సహా దొరికిపోయినా, తీవ్ర అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న సీఎం చంద్రబాబు, నిస్సిగ్గుగా ఆ కేసు మూసివేయించుకున్నారని వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్‌కుమార్‌రెడ్డి ఆక్షేపించారు. ఇప్పటికే ఫైబర్‌నెట్‌ కేసు, లిక్కర్‌ కేసు మూసివేయించుకున్న చంద్రబాబు, ఇప్పుడు అత్యంత హేయంగా స్కిల్‌ కేసు కూడా క్లోజ్‌ చేయించుకున్నారని ఆయన గుర్తు చేశారు. డొల్ల కంపెనీలకు రూ.371 కోట్ల ప్రభుత్వ నిధులు మళ్లించి, అక్కణ్నుంచి వాటిని తన ఖాతాలో వేసుకున్న చంద్రబాబు, అన్ని ఆధారాలతో సహా దొరికి, జ్యుడీషియల్‌ రిమాండ్‌లో జైల్లో గడిపినా, ఇప్పుడు నిర్లజ్జగా కేసు మూసి వేయించుకున్నారని దుయ్యబట్టారు.
    రాయలసీమకు తీరని ద్రోహం చేస్తూ, లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీమ్‌ ఆపేసిన చంద్రబాబు, చరిత్రహీనుడని ఎస్వీ సతీష్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. రాయలసీమ ప్రాజెక్టుల్లో తట్టెడు మట్టి కూడా ఎత్తని చంద్రబాబు, తాను ఆ ప్రాంత ప్రాజెక్టుల కోసం రూ.8 వేల కోట్లు ఖర్చు చేశానని చెప్పడం హేయమని పార్టీ కేంద్ర కార్యాలయంతో మీడియాతో మాట్లాడిన ఆయన చురకలంటించారు.
ప్రెస్‌మీట్‌లో ఎస్వీ సతీష్‌కుమార్‌రెడ్డి ఇంకా ఏం మాట్లాడారంటే..:

స్కిల్‌ స్కామ్‌లో పక్కా ఆధారాలు:
    2014–19 మధ్య  చంద్రబాబుగారు సీఎంగా ఉన్నప్పుడు జరిగిన భారీ స్కిల్‌ స్కామ్‌ను మహారాష్ట్రలో జీఎస్టీ అధికారులు గుర్తించడంతో, వెలుగులోకి వచ్చింది. ఆ కేసులో అన్ని ఆధారాలతో చంద్రబాబు దొరికిపోయారు. సీమెన్స్‌ కంపెనీ కూడా తమకు ఆ ప్రాజెక్టుతో ఎలాంటి సంబంధం లేదని స్టేట్‌మెంట్‌ ఇచ్చింది. ప్రభుత్వ నిధులు రూ.371 కోట్లు డొల్ల కంపెనీలకు వెళ్లాయని తేల్చారు. అంత పక్కాగా ఆధారాలు దొరకడంతో, చివరకు చంద్రబాబు జైలుకు కూడా వెళ్లారు. తీవ్ర అనారోగ్య కారణాలు చూపి, ఆయన బెయిల్‌ పొందారు. తర్వాత తిరిగి అధికారంలోకి రావడంతోనే, దేశంలో ఎక్కడా, ఎప్పడూ జరగని విధంగా, నిస్సిగ్గుగా తనపై నమోదైన కేసులను ఒక్కొక్కటిగా మూసి వేయించుకుంటున్నారు. ఈ కేసులో ఆరోపణలు వాస్తవం కాదంటూ (మిస్టేక్‌ ఆఫ్‌ ఫ్యాక్ట్‌) సీఐడీ ఇచ్చిన తుది నివేదికను పరిగణలోకి తీసుకున్న ఏసీబీ కోర్టు, కేసు మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఇది నూటికి నూరు శాతం చంద్రబాబు తీవ్ర అధికార దుర్వినియోగమే. 

చంద్రబాబు రాయలసీమ ద్రోహి:
    రాయలసీమ ప్రాజెక్టులపై కూటమి ప్రభుత్వ వైఖరి ఆక్షేపణీయం. తెలంగాణ సీఎంతో కుమ్మక్కై, రాయలసీమకు ఎంతో కీలకమైన లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీమ్‌ను ఆపేశారు. శ్రీ«శైలం రిజర్వాయర్‌ నుంచి 800 అడుగుల స్థాయిలో కూడా నీరు తరలించేలా, ఆ స్కీమ్‌ చేపట్టిన నాటి సీఎం శ్రీ వైయస్‌ జగన్, వేగంగా పనులు కొనసాగించారు. ఇప్పుడు ఆ ఇరిగేషన్‌ పథకాన్ని సీఎం చంద్రబాబు, తన ప్రయోజనాల కోసం ఆపేశారు. కాగా, కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపు 20 నెలలు అవుతోంది. రాయలసీమ ఇరిగేషన్‌ ప్రాజెక్టులకు రూ.8 వేల కోట్లు ఖర్చు చేశామని చంద్రబాబు మాదిరిగానే మంత్రి రామనాయుడు కూడా అబద్ధాలు చెబుతున్నారు. కానీ మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క పిడికెడు మట్టి తీయలేదు. చిత్తశుద్ధి ఉంటే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి ఏ ప్రాజెక్టుకు ఎంత ఖర్చు చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలి. ఇటీవల వైయస్‌ఆర్‌సీపీ ఈ విషయంలో సవాల్‌ చేసినా కూటమి ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు స్పందన లేదు.

మా పార్టీ నేతలను ఎందుకు అడ్డుకున్నారు?:
    నిన్న (సోమవారం) నెల్లూరు జిల్లాలో వైయస్‌ఆర్‌సీపీ నేతలు కండలేరు ప్రాజెక్టును పరిశీలించేందుకు వెళ్తుంటే ప్రభుత్వం ఎందుకు అడ్డుకుంది? ప్రాజెక్టులపై గొప్పలు చెప్పుకునే ప్రభుత్వం మా నాయకులను చూసి ఎందుకు భయపెడుతోంది? మీ ఆంతర్యం ఏమిటో చెప్పాలి. జగన్‌గారి హయాంలో సోమశీల ప్రాజెక్టుకు వరద నీరు వచ్చేది. సోమశీల నుంచి కండలేరుకు ఒక్క టీఎంసీ మాత్రమే వెళ్తోంది. దాన్ని 24 వేల క్యూసెక్కులకు పెంచాల్సిన అవసరం ఉంది. కానీ ఈ ప్రభుత్వం వచ్చాక ఒక్క పని కూడా చేయలేదు.
    ప్రజల సంక్షేమం మా బాధ్యత. ప్రాజెక్టులను పరిశీలించేందుకు వెళ్తుంటే ఎందుకు అడ్డుకుంటున్నారు? ఈ పండగ అయిపోయేలోగా అన్ని పార్టీలను ప్రాజెక్టుల వద్దకు తీసుకెళ్లి మీరు చేసిన పనులు చూపించాలి. ఈనెల 19లోగా మమ్మల్ని తీసుకెళ్లకపోతే, రాయలసీమలోని అన్ని ప్రాజెక్టులను వైయస్‌ఆర్‌సీపీ నేతలు సందర్శిస్తారు. ఇందుకోసం యుద్ధానికైనా సిద్ధం అని ఎస్వీ సతీష్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు.

Back to Top