ప్రైవేట్‌కు దీటుగా ప్రభుత్వ స్కూల్స్‌ తీర్చిదిద్దుతాం

మంత్రులు కన్నబాబు, అవంతి శ్రీనివాస్‌
 

 

విశాఖ: ప్రైవేట్‌ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతామని మంత్రులు కన్నబాబు, అవంతి శ్రీనివాస్‌ అన్నారు. సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేస్తున్న పథకాలు చూసి ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయన్నారు. విశాఖలో నాడు – నేడు కార్యక్రమాన్ని మంత్రులు కన్నబాబు, అవంతి శ్రీనివాస్‌ ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. నాడు – నేడు కార్యక్రమమే కాదు.. సంస్కరణలు ఎప్పుడు చేపట్టినా విమర్శలు వస్తాయన్నారు. సంక్షేమ పథకాలు అమలు చూసి లోకేష్‌కు రాజకీయ భవిష్యత్‌ ఉండదని చంద్రబాబుకు భయం పట్టుకుందన్నారు. చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ మాటలు ప్రజలెవరూ విశ్వసించరన్నారు.

Read Also: చంద్రబాబుది దొంగ దీక్ష

తాజా ఫోటోలు

Back to Top