చంద్రబాబు లీకు వీరుడు

లీకులిచ్చి రాజధానిలో భూదందాలు నడిపాడు

దీనిపై సమగ్ర విచారణ జరగాల్సిందే

వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు

అసెంబ్లీ: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు లీకు వీరుడు అని, రాజధాని ఏర్పాటులో లీకులు ఇచ్చి భారీ స్కామ్‌కు తెరలేపాడని వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు ధ్వజమెత్తారు. అమరావతిలో జరిగిన భూదందాలపై సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నియమించిన సబ్‌ కమిటీలో మెంబర్‌గా బాబు భూకబ్జాల వాస్తవాలు తెలుసుకొని ఆశ్చర్యానికి గురయ్యానని మంత్రి అన్నారు. అమరావతిలో జరిగిన ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పై సమగ్ర విచారణకు హోంమంత్రి ప్రవేశపెట్టిన బిల్లుకు మంత్రి కన్నబాబు మద్దతు తెలిపారు. సమగ్ర విచారణ జరిపించి దోషులను శిక్షించాలని కోరారు. అసెంబ్లీలో కన్నబాబు ఏం మాట్లారంటే.. ‘రాజధాని పేరుతో చేసిన భూదందాలు ప్రజలంతా గమనిస్తున్నారు. ఏం జరిగింది.. ఏం జరుగుతుందో చూడాలని నియమించిన సబ్‌ కమిటీల్లో నన్ను కూడా సభ్యుడిని, లోతుకు వెళ్లే కొద్ది కొన్ని నిజాలు ఆశ్చర్యాన్ని కలిగించాయి. కొన్ని ఆధారాలతో ఉన్నంత వరకు తీసుకుంటే 4070 ఎకరాలు ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌లో కొనుగోలు చేసినట్లుగా బయటకు వచ్చింది. అబద్ధాలను కూడా గట్టిగా చెబితే నిజాలుగా నమ్ముతారని చంద్రబాబు మొదటి నుంచి అనుసరిస్తున్నాడు. టీడీపీ సభ్యుడు పయ్యావుల కేశవ్‌ నేను కొనుగోలు చేశాను తప్పేముందని అంటున్నాడు. కేంద్రం తీసుకువచ్చిన బినామీ ప్రొహిబిషన్‌ చట్టాన్ని అమలు చేయండి మాకు ఇబ్బంది లేదని పయ్యావుల మాట్లాడుతున్నాడు. తప్పకుండా ఆ చట్టాన్ని కూడా పరిశీలిస్తాం.

రాజధాని ల్యాండ్‌ పూలింగ్‌కు సంబంధించి చాలా చట్టాలను టీడీపీ తుంగలో తొక్కింది. అందులో అసైన్డ్‌ ల్యాండ్‌ ప్రొబిషన్‌ ఆఫ్‌ ట్రాన్స్‌ఫర్‌ యాక్టు 1977, అది కాకుండా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ ప్రివెంట్‌ యాక్టు 1989ను కూడా దుర్వినియోగం చేశారు. ఈ యాక్టుల పరిధిలో కూడా ఏమేమి అక్రమాలు జరిగాయో తేల్చాలని కోరుతున్నాను. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు లీకు వీరుడు. ఇప్పుడు సభ జరుగుతుంటే కూడా లీకులు ఇస్తున్నాడు. దాన్ని పచ్చ మీడియాల్లో ప్రసారం చేయడం.. ప్రజలు గందరగోళం పడుతుంటారు. రాజధాని విషయంలో కూడా కొన్ని లీకులు ఇచ్చి వారి సొంత మనుషులకు మేలు చేశాడు. ప్రధానంగా ఏ చట్టాలు అయితే తుంగలోకి తొక్కారో వాటిని పరిశీలించాలని, బినామీ ప్రొహిబిషన్‌ యాక్టును కూడా పరిగణలోకి తీసుకోవాలని హోంమంత్రిని కోరారు.  

 

Back to Top