వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యం

విత్తనం నుంచి విక్రయం వరకు రైతుకు తోడుగా నిలిచాం

రైతు సంక్షేమానికి సీఎం వైయస్‌ జగన్‌ పెద్దపీట వేశారు

ఏడాదిన్నర పాలనలో రూ.13,463 కోట్లు రైతుల ఖాతాల్లో జమచేశాం

చంద్రబాబు ఐదేళ్ల పాలనలో రైతులకు ఇచ్చింది రూ.12,731 కోట్లే 

బాబు పెట్టిన బాకీలు తీర్చుతూ.. మరోపక్క సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం

వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు

అసెంబ్లీ: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారని, రైతుల సంక్షేమానికి పెద్దపీట వేశారని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. అసెంబ్లీలో మంత్రి కన్నబాబు మాట్లాడుతూ.. ‘మా ముఖ్యమంత్రి చేతల ముఖ్యమంత్రి. వైయస్‌ఆర్‌ సీపీ మేనిఫెస్టోలో రైతాంగం కోసం ఆనాడు సీఎం వైయస్‌ జగన్‌ కొన్ని అంశాలు చెప్పారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఒక్క అంశాలన్ని అమలు చేశారు. వైయస్‌ఆర్‌ రైతు భరోసా సొమ్ము రూ.12,500 నాలుగేళ్లు ఇస్తామని చెప్పి.. ఇచ్చిన మాట కంటే మిన్నగా రూ.13500 సాయం ఐదు సంవత్సరాలు అందజేస్తున్నారు. పంట బీమా పథకం ఉచితంగా అమలు చేస్తున్నారు. రైతులకు వడ్డీలేని పంట రుణాలు ఇస్తామని చెప్పి.. వైయస్‌ఆర్‌ సున్నావడ్డీ పథకాన్ని ప్రారంభించారు. రైతులకు ఉచితంగా బోర్లు వేయిస్తామని చెప్పారు.. చెప్పినదానికంటే ఎక్కువగా వైయస్‌ఆర్‌ జలకళ ద్వారా ఉచితంగా బోర్లు వేయించడమే కాకుండా ఉచితంగా మోటార్లు కూడా అందిస్తున్నారు. ఆక్వా రైతులకు కరెంట్‌ చార్జీలు యూనిట్‌ రూ.1.5కే అందిస్తామని చెప్పి అమలు చేస్తున్నారు. ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి ఈ ఒక్క ఏడాదిలో 3200 కోట్ల రూపాయలతో పంటలను మార్కెట్‌ ఇంటర్వెన్షన్‌ కింద కొనుగోలు చేశాం. ప్రకృతి విపత్తుల నిధిని ఏర్పాటు చేశారు. ప్రతి నియోజకవర్గంలో గిడ్డంగులు, శీతలీకరణ గిడ్డంగులు ఏర్పాటు చేస్తామని చెప్పినట్లుగానే.. ప్రతి నియోజకవర్గానికి కాదు.. ప్రతి మండలానికి తీసుకెళ్తున్నాం. 

సహకార రంగాన్ని ఆధునీకరించేందుకు అన్ని చర్యలు తీసుకున్నాం. ఏడాదిలోపు  వ్యవస్థను చక్కదిద్ది.. సహకార ఫ్యాక్టరీల ద్వారా డెయిరీలను సరిదిద్దుతాం. అమూల్‌ సంస్థను తీసుకువచ్చి పాల ఉత్పత్తిదారులకు అధనంగా లబ్ధి చేకూరే విధంగా చర్యలు తీసుకున్నాం. వ్యవసాయ టాక్టర్లకు రోడ్డు, టోల్‌ ట్యాక్స్‌ను రద్దు చేశాం. ప్రమాదవశాత్తు, ఆత్మహత్య చేసుకొని రైతులు మరణిస్తే ఆ కుటుంబానికి రూ.7 లక్షల పరిహారం ఇస్తామని చెప్పాం.. అమలు చేస్తున్నాం. ఏడాదిన్నర మా ప్రభుత్వం మేనిఫెస్టోలో రైతులకు ఇచ్చిన ప్రతి హామీని సీఎం అమలు చేశారు. 

మాటలు చెప్పి తప్పించుకోవడం, దొంగ లెక్కలతో పబ్బం గడుపుకోవడం ఈ ప్రభుత్వానికి చేతకాదు. రుణమాఫీ రూ.87 వేల కోట్లు చేయాల్సింది.. దాన్ని రూ.24 వేల కోట్లకు తెచ్చి.. దాన్ని 15 వేల కోట్లకు కుదించి చేతులు దులుపుకుంది గత ప్రభుత్వం. రైతు కష్టాన్ని తీర్చడం కోసం మనసుతో కార్యక్రమాలను అమలు చేస్తున్న ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌. 

రాజు బాగుంటే రాష్ట్రం బాగుంటుందని చెప్తారు. ఏరోజు అయితే సీఎం వైయస్‌ జగన ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారో.. ఆ రోజు నుంచి రాష్ట్రంలో బ్రహ్మాండంగా వర్షాలు పడుతున్నాయి. ఎప్పుడూ నిండని రిజర్వాయర్లు నిండుతున్నాయి. అనంతపురం లాంటి కరువు సీమలో కూడా అధిక వర్షపాతం నమోదవుతుంది. జూన్‌ నుంచి నవంబర్‌ వరకు విపరీతంగా రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు, వరదలు వచ్చాయి. నివర్‌ తుపాన్‌ పెద్ద ఎత్తున నష్టపరిచింది. ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు ప్రభుత్వం ఏ విధంగా రైతులను, ప్రజలను ఆదుకుందదది పరిగణలోకి తీసుకోవాలి. తుపాన్‌కు సంబంధించిన నష్టం అంచెనాలను 10వ తేదీ వరకు పూర్తి చేయాలని, డిసెంబర్‌ 30 కల్లా నష్టపరిహారం ఇవ్వాలని సీఎం ఆదేశించారు. 

రంగు మారిన ధాన్యం, మొలకెత్తిన ధాన్యం కొనుగోలుకు కూడా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ఏ ఒక్క ఇబ్బందిని తక్కువ చేసి చూడొద్దని సీఎం మాకు చెప్పారు. ఏరియల్‌ సర్వే ద్వారా తుపాన్‌ ప్రభావిత ప్రాంతాలను పరిశీలిస్తూ అధికారులు, మంత్రులతో సమీక్షలు చేశారు. 

ఏరియల్‌ సర్వేతో కష్టాలు తీరుతాయా అని ప్రతిపక్ష నేత మాట్లాడుతున్నాడు. ముఖ్యమంత్రి గాల్లో చక్కర్లు కొడుతున్నాడని లోకేష్‌ ట్వీట్‌ చేశాడు. ఈ సభ దృష్టికి ఒక చిన్న విషయం తీసుకువస్తున్నాను. చంద్రబాబు హెలికాప్టర్‌లో ఏరియల్‌ సర్వే చేసిన దృశ్యం.. మాది గాలి పర్యటన అయితే మీ పర్యటన ఏంటీ..? బాధ్యత కలిగిన ప్రతిపక్షం బాధ్యతతో వ్యవహరించాలి. నవంబర్‌ 16 వరకు భారీ వర్షాలు కురిశాయి. శాసనసభ్యులు, మంత్రులు ఫీల్డ్‌లోనే ప్రజలకు అందుబాటులో ఉండాలని సీఎం ఆదేశించారు. పది రోజుల పాటు సహాయక చర్యల్లో పాల్గొన్నాం. 26న హైదరాబాద్‌ నుంచి లోకేష్‌ వచ్చి ట్రాక్టర్‌కు పసుపు పూలు కట్టుకొని కొల్లేరు వెళ్లారు.. ట్రాక్టర్‌ ప్రమాదానికి గురైంది. నిజంగా ఆ ట్రాక్టర్‌ ప్రమాదంలో ఏదైనా జరిగి ఉంటే మా ప్రభుత్వ కుట్ర అనేవారు. 

నాటి తుపాన్‌ల ఇన్‌పుట్‌ సబ్సిడీ కూడా చంద్రబాబు అధికారంలో నుంచి దిగిపోయే నాటికి ఇవ్వలేదు. పంట నష్టపరిహారం గురించి చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు సీఎం వైయస్‌ జగన్‌. ఏ సీజన్‌లో పంట నష్టం జరిగితే ఆ సీజన్‌లోనే పరిహారం ఇవ్వాలనేది సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశం. జూన్‌ నుంచి సెప్టెంబర్‌ వరకు కురిసిన వర్షాలకు జరిగిన నష్టాలకు పరిహారం అక్టోబర్‌లో, అక్టోబర్‌ కురిసిన వర్షాలకు దెబ్బతిన్న పంటలకు పరిహారం నవంబర్‌లో పరిహారం అందించాం.

ఇన్‌పుట్‌ సబ్సిడీకి సంబంధించి 2015 నవంబర్, డిసెంబర్‌లో అధికవర్షపాతంతో రైతులు నష్టపోతే రూ.260 కోట్ల ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇవాల్టికీ ఇవ్వలేదు. 2015లో చిత్తూరులో మొలకల చెరువుకు రూ.7.33 కోట్లు ఇవ్వలేదు. 2014 సెప్టెంబర్‌ అధిక వర్షపాతానికి పశ్చిమగోదావరి జిల్లాలో రైతులకు ఇవ్వాల్సిన రూ.2.16 కోట్లు క్లీయర్‌ చేయలేదు. ఒక రైతుకు కష్టం వస్తే తక్షణం ఆదుకోవాలి.. సాయం చేయాలనే ఉద్దేశంతో సీఎం వైయస్‌ జగన్‌ ముందుకెళ్తున్నారు. 

2019–20 మధ్య ఇన్‌పుట్‌ సబ్సిడీని 4,20,460 మంది రైతులకు రూ.306.92 కోట్లు ఇచ్చాం. ఉద్యానవన పంటలకు 2019 మే నుంచి 2020 అక్టోబర్‌ వరకు 1,16,265 మంది రైతులకు రూ.102.24 కోట్లు ఇన్‌పుట్‌ సబ్సిడీగా అందించాం. నివర్‌ తుపాన్‌కు సంబంధించి డిసెంబర్‌ నెలాఖరుకు ఇన్‌పుట్‌ సబ్సిడీ అందిస్తాం. 

అధికారంలోకి వస్తే ఉచిత పంటల బీమా తీసుకువస్తామని హామీ ఇచ్చి అమలు చేస్తున్నారు. 2016–17 నుంచి 2018–19 వరకు మూడేళ్లలో రూ.871.26 కోట్లు రైతులు ప్రీమియం చెల్లించారు. ఈ రోజు ముఖ్యమంత్రి నిర్ణయం వల్ల  ప్రతి ఏటా రైతాంగానికి వందల కోట్లు ప్రీమియం రూపంలో మిగులుతుంది. ఈ–క్రాప్‌ తప్పనిసరి చేశాం. ఈక్రాప్‌లో నమోదైతే చాలు పంటల బీమా అందే విధానాన్ని అమలు చేస్తున్నాం. రైతు బీమాకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ వాటా, రైతు వాటాగా ప్రభుత్వం రూ.1030 కోట్లు చెల్లించింది. పంటల బీమాకు 2016–17లో 17.79 లక్షల మంది రైతులు, 2017–18లో 18.22 లక్షల మంది, 2018–19లో 24.83 లక్షల మంది రైతులు కవర్‌ అయితే.. ఈ ఒక్క సంవత్సరం 2019–20లో 58.77 లక్షల మంది రైతులు కవర్‌ అవుతున్నారు. 

వైయస్‌ఆర్‌ సున్నావడ్డీ పంట రుణాల పథకం ద్వారా నవంబర్‌ 17వ తేదీన రూ.510 కోట్లు రైతుల ఖాతాల్లో వేశాం. సున్నావడ్డీ డబ్బులు ఇవ్వడం కాకుండా.. గత ప్రభుత్వం బాకీ పడిన డబ్బులు కూడా ఈ ప్రభుత్వం చెల్లించింది. 2018–19లో చంద్రబాబు పెట్టిన బకాయిలు రూ.689 కోట్లు అకౌంట్లలో వేశారు. ఈ ప్రభుత్వం వచ్చిన నాటిన ఉంచి బాబు గారి బాకీలు కట్టడమే పనిగా సరిపోతుంది. చెరకు రైతులకు బకాయిలు ఎందుకు చెల్లించలేదు. ధాన్యం రైతులకు రూ.900 కోట్ల బకాయిలు పెట్టారు. ఆయిల్‌ ఫామ్‌ రైతులకు రూ.80 కోట్లు బకాయిలు పెడితే సీఎం వైయస్‌ జగన్‌ చెల్లించారు. విత్తనాలు కొనుగోలు చేసిన రూ.398 కోట్లు కూడా బకాయిలు పెట్టి వెళ్లిపోయారు. చంద్రబాబు బాకీలు తీర్చుతూ.. మరోపక్క సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం. విద్యుత్‌ బకాయిలు రూ. 8500 కోట్లు చెల్లించాం. చంద్రబాబు ఎన్నికల నాలుగు నెలల ముందు చూపించిన ప్రేమ.. అంతకు ఉందు నాలుగేళ్లలో చూపించలేదు కాబట్టే ఈఅనర్ధాలు. 

2019–20లో వైయస్‌ఆర్‌ రైతు భరోసా – పీఎం కిసాన్‌ పథకం కింద ఇప్పటి వరకు రూ. 11,981 కోట్లు రైతుల అకౌంట్లలో వేశాం. వైయస్‌ఆర్‌ సున్నావడ్డీ కింద గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు, ఈ ప్రభుత్వం ఇచ్చే డబ్బులు కలిపి రూ.1073.35 కోట్లు ఇచ్చాం. ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇప్పటి వరకు రూ.409.15 కోట్లు ఇచ్చాం. ఇవన్నీ కలిపి రూ.13,463.50 కోట్లు డీబీటీ కింద రైతుల అకౌంట్లలో వేశాం. గత ప్రభుత్వం రైతు రుణమాఫీ కింద రూ.12,731 కోట్లు ఇస్తే.. ఏడాదిన్నర కాలంలోనే మా ప్రభుత్వం రూ.13,463.50 కోట్లు. 

విత్తనం ఇచ్చే దగ్గర నుంచి విక్రయించే వరకు ప్రతి అడుగులోనూ రైతులకు ప్రభుత్వం అండగా ఉండాలి.. ఎంత ఖర్చు చేయడానికైనా నేను సిద్ధం అని సీఎం వైయస్‌ జగన్‌ పదే పదే చెబుతారు. మా ముఖ్యమంత్రి రైతు పక్షపాతి కాబట్టే ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారు. రూ.3000 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశాం. దాన్ని మించి మార్కెట్‌ ఇంటర్వెన్షన్‌ చేశాం. రూ.4607 కోట్ల విలువైన పంట ఉత్పత్తులను ఈ ప్రభుత్వం నేరుగా కొనుగోలు చేసింది. కేంద్రం ఎంఎస్‌పీ ప్రకటించిన పంటలకే కాకుండా నిల్వ ఉండని పంటలకు కూడా గిట్టుబాటు ధర ప్రకటించిన మొట్టమొదటి ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌. 

రైతు భరోసా కేంద్రాలను కొనుగోలు కేంద్రాలుగా ఏర్పాటు చేశాం. సీఎం యాప్‌ను తీసుకువచ్చాం. ప్రతి రోజు ప్రతి గ్రామంలో ఏ పంట.. ఎంత దిగుబడి.. ఎంత ధర అనే విషయాన్ని యాప్‌లో నమోదు చేస్తారు. మొట్టమొదటి సారి పొగాకు రైతులను ఆదుకోవడానికి పొగాకు కొనుగోలు చేశాం. రూ.120 కోట్ల విలువైన 12.93 మిలియన్ల కేజీల పొగాకు కొనుగోలు చేశాం. 

పత్తి పంట కొనుగోలు సీసీఏ కొనుగోలు చేస్తుంది. జిన్నింగ్‌ మిల్లులు ఎక్కడ ఉంటే అక్కడే కొంటామని సీసీఏ చెప్పింది. ట్రాన్స్‌పోర్టు ఎంత అయితే అంత నేను ఇస్తా పత్తి పంట కొనుగోలు చేయండి.. రైతుకు నష్టం జరగడానికి వీల్లేదని సీఎం వైయస్‌ జగన్‌ చెప్పారు. 

ప్రతి గ్రామంలో గోదాములు, అవసరమైన చోట కోల్డ్‌ స్టోరేజీలు, ఆర్బీకేలకు అనుసంధానంగా సార్టింగ్, గ్రేడింగ్‌ సెంటర్, 9,899 గ్రామాల్లో బల్క్‌ మిల్క్‌ చిల్లింగ్‌ సెంటర్లు, ఆక్వా హబ్, జనతా బజార్లు ఏర్పాటు చేయనున్నాం. వీటన్నింటికీ రూ.10 వేల కోట్ల వ్యయంతో ప్రణాళిక సిద్ధం చేసి ఈ సంవత్సరం నుంచి అమలు చేయనున్నాం. కస్టమ్‌ హైరింగ్‌ సెంటర్‌లను ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో ఏర్పాటు చేస్తున్నాం. అది కాకుండా రాష్ట్రంలో ఉన్న 65 అగ్రోస్‌ హబ్‌లో మెగా కస్టమ్‌ హైరింగ్‌ సెంటర్‌ ఉంటుంది. వీటిల్లో రైతుకు రావాల్సిన చిన్న పరికరాల దగ్గర నుంచి అవసరమైన పెద్ద పరికరాల వరకు ఉంటాయి.’
 

తాజా వీడియోలు

Back to Top