దెబ్బ‌తిన్న పంట‌ల‌కు న‌ష్ట‌ప‌రిహారం ఇచ్చి ఆదుకుంటాం

వ్య‌వ‌సాయ శాఖ మంత్రి క‌న్న‌బాబు
 

విజ‌య‌వాడ‌:  భారీ వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల కార‌ణంగా దెబ్బ‌తిన్న పంట‌ల‌కు న‌ష్ట‌ప‌రిహారం ఇచ్చి ఆదుకుంటామ‌ని వ్య‌వ‌సాయ శాఖ మంత్రి కుర‌సాల క‌న్న‌బాబు హామీ ఇచ్చారు. బుధ‌వారం విజ‌య‌రాయుడుపాలెం, యండ‌మూరులో దెబ్బ‌తిన్న పంట‌ల‌ను మంత్రి, అధికారులు ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా క‌న్న‌బాబు మాట్లాడుతూ..భారీ వ‌ర్షాల కార‌ణంగా రాష్ర్టంలో  వేలాది ఎకరాల్లో పంట నష్టం జరిగిందని తెలిపారు.  రాష్ట్రంలో మ‌రో రెండు రోజుల‌పాటు భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావరణ శాఖ చెప్తోందన్నారు. ఈ నేప‌థ్యంలో పంట నష్టాన్ని అంచనా వేసేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని, ఏ ఒక్క రైతుకు నష్టం జరగనివ్వమ‌ని మంత్రి హామీ ఇచ్చారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top