కాకినాడ: చంద్రబాబు నాడు అగ్రిగోల్డ్ ఆస్తులను కాజేయాలని కుట్రలు చేశారని మంత్రి కన్నబాబు విమర్శించారు. గురువారం కాకినాడలో అగ్రిగోల్డ్ బాధితులకు చెక్కుల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ..ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన మాటకు కట్టుబడి అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకున్నారన్నారు. తొలి విడతలో రూ.10 వేల లోపు డిపాజిట్లకు చెక్కులు పంపిణీ చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో 3,69,655 మందికి రూ.263.99 కోట్లు ప్రభుత్వం మొదటి విడతగా విడుదల చేసినట్లు చెప్పారు. త్వరలో రూ.20 వేల లోపు డిపాజిటర్లకు కూడా చెక్కులు పంపిణీ చేస్తామన్నారు. నాటి హామీకి నేడు కార్యరూపంలోకి తెచ్చిన సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి బడ్జెట్‌లో రూ.1,150 కోట్లు కేటాయించారని తెలిపారు. Read Also: నేడు అగ్రి గోల్డ్ బాధితులకు చెక్కుల పంపిణీ