రాజకీయాల కోసమే కేసీఆర్‌ విమర్శలు

మంత్రి కురసాల కన్నబాబు
 

విజయవాడ: రాజకీయాల కోసం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ విమర్శలు చేసినట్లున్నారని మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. విభజన సమస్యలు పరిష్కారం కాకపోవడం వల్ల ఏపీ నష్టపోయిందని తెలిపారు. విభజన వల్ల ఏపీ నష్టపోయిందని పార్లమెంట్‌లో ప్రధానినే చెప్పారని గుర్తు చేశారు. ఏపీకి రావాల్సిన రూ.5 వేల కోట్ల విద్యుత్‌ బకాయిలను ఇవ్వలేదన్నారు. ఉమ్మడి సంస్థలన్నింటినీ విభజించలేదన్నారు.  ఏపీ ఆఫీసుల తాళాలు బద్దలు కొట్టి తెలంగాణ వాడుకుంటుందన్నారు.  ఓటుకు నోటు కేసుతో చంద్రబాబు ఏపీ ఆస్తులన్నింటిని వదిలేసి వచ్చారని విమర్శించారు. కాలికేస్తే మెడకు వేసే నాయకుడు ఎవరో అందరికీ తెలుసు అని ఎద్దేవా చేశారు. కేంద్రం జోక్యం చేసుకొని వి«భజన సమస్యలు పరిష్కరించాలని మంత్రి కోరారు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top