వైయ‌స్‌ జగన్ కాలి గోటికి కూడా చంద్రబాబు వ్యక్తిత్వం సరిపోదు..! 

రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌ రెడ్డి 

 నిజాయితీపరుడివి అయితే.. నీపై వచ్చిన ఆరోపణలపై సీబీఐ విచారణ కోరతావా?

 నీకు దమ్ముంటే, నా చాలెంజ్‌ స్వీకరించు చంద్రబాబూ..?

 మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి సవాల్.

2019లో బాబు వన్‌సైడ్‌ పోలింగ్‌ అన్నాడు..23 సీట్లకు పరిమితం అయ్యాడు. 

ఈసారి అదే చెప్తున్నాడు..ఆ 23లో 2 కానీ, 3 కానీ ఖాయం. 

చంద్రబాబు సభలు అట్టర్‌ప్లాప్‌ అవుతున్నాయి..ప్రజాగళం మూగబోతోంది.

ఇక నీ అనుభవం చాలయ్యా బాబూ అంటూ..2019లో జగన్‌ గారిని ప్రజలు సీఎంగా చేసుకున్నారు. 

నువ్వు ముఖ్యమంత్రిగా ఉండగా ఏనాడైనా వర్షాలు పడ్డాయా? రిజర్వాయర్లు నిండాయా? 

వ్యవసాయంలో నువ్వేం చేశావో..మేమేం చేశామో చర్చించే దమ్ముందా?

రెయిన్‌ గన్‌ల పేరుతో నువ్వు పాదం మోపిన ప్రతి పొలం ఎండిపోయింది మర్చిపోయావా? 

మైకేల్‌ జాక్సన్‌లా మైకు తగిలించుకుని చంద్రబాబు ఎన్ని చెప్పినా ప్రజలు నమ్మరు.

చంద్రబాబు చెప్పి ఎగ్గొడతాడు..వైయ‌స్ జగన్‌ గారు చెప్పింది చెప్పినట్లు ఇంటికి చేరుస్తాడనేదే ప్రజల నమ్మకం:  మంత్రి కాకాణి గోవర్ధన్‌ రెడ్డి. 

నెల్లూరు:  వైయ‌స్‌ జగన్ కాలి గోటికి కూడా చంద్రబాబు వ్యక్తిత్వం సరిపోదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌ రెడ్డి అన్నారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి  కాకాణి గోవర్ధన్‌ రెడ్డి మీడియాతో ఇంకా ఏం మాట్లాడారంటే:

అవినీతి, అబద్ధాలతో బతికే నీకు జగన్‌ గారిని విమర్శించే స్థాయి ఎక్కడది?:
– నేను వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండి ఈ రాష్ట్రానికి ఎన్ని సంస్కరణలు తెచ్చానో చెప్తా.. నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి ఏం తెచ్చావో చెప్పు.
– నీ హయాంలో రైతు భరోసా కేంద్రాలున్నాయా? వాటి ద్వారా ఎరువులిచ్చావా? ఉచిత పంటల బీమా ఉందా? 
– నీ హయాంలో ధాన్యం పుట్టి ధర రూ.12వేల నుంచి రూ.13 వేలు ఉండేది. 
– నీ పక్కన ఉన్న సోమిరెడ్డే రైస్‌మిల్లర్లు, దళారుల వద్ద రూ.50 కొట్టేశాడు.
– ఇప్పుడు రూ.18,500 గిట్టుబాటు ధర ఉంటే...మిల్లర్లు రూ.22వేలు పెట్టి రైతుల వద్ద కొనుగోలు చేస్తున్నారు. 
– రైతు రథాల పేరుతో ట్రాక్టర్ల ధర పెంచి..దానిలో కూడా నువ్వూ, నీ కొడుకు, సోమిరెడ్డి దోచుకున్నారు.
– నిద్రలేస్తే అవినీతి, అబద్ధాల మయమైన నీకు జగన్‌ గారిని విమర్శించే స్థాయి ఎక్కడుంది?
– నీకు ఎప్పుడూ గమ్యం ఉంటుంది కానీ..మార్గం ముఖ్యం కాదు అనుకునే వాడిని. 
– జీవితంలో, రాజకీయాల్లో వ్యక్తికి మార్గం ముఖ్యం. నీకసలు మార్గమే అవసరం లేదు. 
– దేనిమీదైనా సరే..నడిచి వెళ్లి గమ్యాన్ని చేరుకుంటే చాలనుకునే నీచమైన మనస్థత్వం నీది.
– జగన్‌ గారు ఆ గమ్యాన్ని చేరుకోడానికి మార్గాన్ని అన్వేషించేవారు. 
– జగన్‌ గారితో నువ్వు ఈ జన్మలో సాటిరావు. నువ్వు ఎన్నిరకాలుగా ఆరోపణలు చేసినా ఫలితం లేదు.

నువ్వు ముఖ్యమంత్రిగా ఉంటే అసలు వర్షాలు పడతాయా?:
– వ్యవసాయం గురించి నువ్వు మాట్లాడితే నవ్వి పోతారు. ఎప్పుడన్నా సంపూర్ణంగా సాగు నీరు ఇచ్చిన సందర్భంలో నీ జీవితంలో ఏరోజైనా ఉందా?
– అసలు నువ్వు ముఖ్యమంత్రిగా ఉంటే వర్షాలు పడతాయా? రిజర్వాయర్లు నిండుతాయా? 
– రైతులు అసలు వర్షాలే లేవని ఏడుస్తుంటే నేను వ్యవసాయంలో నన్ను మించిన వాడు లేడని చెప్పుకుంటావు.
– అనంతపురంలో వేరుశనగకు రెయిన్‌ గన్‌లని ఇస్తే నీ పాదం మోపిన పొలం కూడా ఎండిపోయింది.
– నీ వ్యక్తిత్వం ఉన్నతమైంది కాకపోయినా నువ్వు ఉన్నతమైన పదవిని అనుభవించావు. 
– ఇలాంటి వాడినా మేం ముఖ్యమంత్రిగా చేసింది అని ప్రజలు ఈసడించుకుంటున్నారు. 
– సోమిరెడ్డికి నువ్వు టికెట్‌ ఇవ్వకూడదని మూడు, నాలుగు పేర్లు పరిశీలించి..వాళ్లు ఎవరూ సర్వేపల్లి రాలేమంటే తిరిగి సోమిరెడ్డికే టికెట్‌ ఇచ్చావు. 
– అలాంటి సోమిరెడ్డిని తీసుకొచ్చి ఆయనేదో ఈ నియోజకవర్గానికి చేస్తాడు అంటే నమ్మటానికి ప్రజలు ఏమైనా పిచ్చోళ్లా?
– చివరికి కొత్తగా నిన్నగాక మొన్న కండువా వేసుకున్న వారికి కూడా టికెట్‌ ఇస్తే ఎలా ఉంటుందని వాకబు చేశావు.
– చివరికి ఎవరూ రాలేమంటే ఇతనికి ఇచ్చావు. టీడీపీ నాయకులు ఈ సీటుపై ఏం మాట్లాడుకున్నారో ఆడియో, వీడియోలు కూడా బయటకు వచ్చాయి.
– చంద్రబాబు ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు ఒక సభ్యత, సంస్కారం ఉండేలా మాట్లాడాలి.

నీపై వచ్చిన ఆరోపణలపై సీబీఐ విచారణ కోరతావా చంద్రబాబూ?:
– నీకు దమ్ము, ధైర్యం ఉంటే..నువ్వు నిజంగా నీతివంతుడివే అయితే  నాపై చేసిన ఆరోపణలను నిరూపించండి.
– నేనే స్వయంగా హైకోర్టులో నాపై వచ్చిన అభియోగాలపై సీబీఐతో విచారణ చేయించండి అని పిల్‌ వేసుకుంటా. 
– చంద్రబాబుకు చాలెంజ్‌ విసురుతున్నా. ఎన్నికలు అయ్యే లోపు నీపై వచ్చిన ఆరోపణలపై సీబీఐతో విచారణ జరిపించుకుంటావా? 
– నేను సీబీఐకి లెటర్‌ రాస్తా..నువ్వూ రాయి..ఇద్దరం కలిసి విచారణ జరిపించుకుందాం.
– ఇదే చాలెంజ్‌ నేను గతంలో కూడా విసిరాను. నాపై సీబీఐ విచారణ వేసినప్పుడే నేను ధైర్యంగా ఆహ్వానించాను.
– నీ మీద వచ్చిన అబియోగాలకు నువ్వు స్టే తెచ్చుకున్నావు..దాన్ని తొలగించుకుని సీబీఐ విచారణకు సిద్ధం అని చెప్పాలని డిమాండ్‌ చేశా. కానీ నువ్వు చెప్పలేకపోయావు. 
– నీపై అనేకమైన పాత, కొత్త ఆరోపణలున్నాయి. ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు నుంచి ఇన్‌సైడర్‌ ట్రేడింగ్, స్కిల్‌ స్కాం...ఇలా చాలా ఉన్నాయి. 
– ఏమీ లేకుండా సర్వేపల్లిలో కేజీఎఫ్‌ అంటూ మాట్లాడితే ఎలా..? నువ్వు ఇక్కడకు రా.
– ఇక్కడ నువ్వు చూడాల్సింది కేజీఎఫ్‌ కాదు..ఇక్కడ జరిగిన అభివృద్ధి చూడు. 
– సర్వేపల్లిలో అభివృద్ధిని చూస్తే నేను ఇలా కుప్పంలో చేయలేకపోయానే అని అన్నం కూడా ముట్టవు. నువ్వు సిగ్గుతో చచ్చిపోతావ్‌. 
– మా సభలకు వచ్చిన జనాల్లో సగం కూడా నీకు రావడం లేదంటే ప్రజలు నిన్ను ఏ మేరకు నమ్ముతున్నారో అర్ధం అవుతుంది.

జగన్‌ గారి కాలిగోటితో కూడా చంద్రబాబు వ్యక్తిత్వం సరిపోదు:
– 2019లో వన్‌సైడ్‌ పోలింగ్‌ జరిగింది...నేనే ముఖ్యమంత్రి అవుతాను అని చెప్పి 23 సీట్లకు పరిమితం అయ్యాడు. 
– ఈసారి ఆ 23లో 2 కానీ, 3 కానీ వస్తాయి. ఆ ఫ్రస్టేషన్లో నీకు జనం రాకపోతే..నేను జనాన్ని ఆపేశాను అంటున్నావు. 
– అంటే నేను ఎంత బలవంతుడినో నువ్వే ఒప్పుకుంటున్నావు. నీ పక్కన ఉన్న సోమిరెడ్డి ఎంత బలహీనుడో అర్ధం అవుతుంది.
– నువ్వు చెప్తున్నట్లు అవినీతి జరిగి, అభివృద్ధి జరగకపోయి ఉంటే నీకు జనం నీరాజనాలు పట్టాలి కదా? 
– నీకు జనం రాలేదని నాపై, జగన్‌ గారిపై మండిపడితే ఎలా? 
– జగన్‌ గారి కాలి గోటికి నీ వ్యక్తిత్వం సరిపోతుందా? 
– రాష్ట్ర విభజన సందర్భంగా కాంగ్రెస్‌పై ప్రజలకు నమ్మకం లేక, ప్రత్యామ్నాయంగా నువ్వేదో అనుభవజ్ఞుడివని నీవైపు మొగ్గు చూపారు.
– నీ అనుభవం ఏంటో 2014–19లో  కొండలు వద్ద నుంచి అన్నీ ఉండలు చేసుకుని అబ్బా కొడుకులు తిన్నప్పుడే ప్రజలకు అర్ధం అయ్యింది. 
– అందుకే నీ అనుభవం ఇక చాలయ్యా...అని జగన్‌ గారికి అధికారం కట్టబెట్టారు. 
– మళ్లీ సిగ్గులేకుండా నా అనుభవం అంటూ చెప్పుకుంటున్నాడు. మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసిన నువ్వు ప్రజలకు ఎందుకు మేలు చేయలేకపోయావు? 
– ఇప్పుడు అవకాశం ఇస్తే చేస్తాను అంటున్నావ్‌..అవకాశం ఇచ్చినప్పుడు ఎందుకు చేయలేదో చంద్రబాబు సమాధానం చెప్పాలి. 
– నువ్వేం చేశావో..నువ్వు ఇచ్చిన హామీలు ఏ విధంగా నిలబెట్టుకున్నావో చెప్పు.
– జగన్‌ గారు తానిచ్చిన హామీలు 99 శాతం అమలు చేశారని ప్రజలే చెప్తున్నారు. నీ సర్టిఫికెట్‌ అవసరం లేదు.
– అడ్డుతొలగించైనా సరే ఏదో ఒక విధంగా ఆ కుర్చీలో కూర్చోవాలన్నట్లు తయారయ్యాడు. 

మైకేల్‌ జాక్సన్‌లా మైకు తగిలించుకుని ఎన్ని చెప్పినా ప్రజలు నమ్మరు:
– జగన్‌ గారి పరిపాలన గురించి ఎన్నో అబద్ధపు మాటలు మాట్లాడిన నీకు ఇప్పడు అభ్యర్థులను పెట్టుకోడానికి చెమటలు పడుతున్నాయి. 
– ఈ రాష్ట్రంలో సామాజిక సాధికారత ఎవరు కల్పించారో ఒక్క సారి చూసుకో. 
– నువ్వు చేసిన ఆరోపణలపై నేను విచారణకు సిద్ధంగా ఉన్నా..నీపై వచ్చిన ఆరోపణలకు నువ్వు విచారణకు సిద్ధమా? 
– నువ్వు అవినీతిపరుడివి కాదు అనుకుంటే ఎన్నికల సమయంలో సీబీఐ విచారణ వేయించుకో. 
– నిన్నటి సభ అట్టర్‌ ప్లాప్‌ అయ్యింది..ప్రజాగళం మూగబోయింది.
– ఇక చంద్రబాబుకు ఏపీలో అన్ని చోట్ల బాయ్‌ బాయ్‌ చెప్పినట్లు నెల్లూరు జిల్లాలోనూ అదే విధంగా చెప్పారు. 
– మా హయాంలో ఎక్కడైనా రైతులు రొడ్డుమీదకు వచ్చి మాకు నీరివ్వలేదని, విత్తనాలు, ఎరువుల కొరత, గిట్టుబాటు ధర రాలేదనే మాట వినిపించలేదు. 
– నీకూ..మాకు ఉన్న తేడా అది. నువ్వు సర్టిఫికెట్‌ ఇవ్వనవసరం లేదు. సుపరిపాలనను అందుకున్న ప్రజలే మాకు సర్టిఫికెట్‌ ఇస్తారు. 
– మైకేల్‌ జాక్సన్‌లా ఒక మైకు తగిలించుకుని మీరు ఎన్ని చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. 
– నిన్న నీ యాత్రతో నెల్లూరు జిల్లాలో నీకు ఒక్క సీటు కూడా వచ్చేది లేదనేది అర్ధం అయిపోయింది.
– చంద్రబాబునాయుడు వాగ్ధానాలను ప్రజలు నమ్మే పరిస్థితి లేనేలేదు.
– ఇప్పుడు సూపర్‌ సిక్స్‌ అన్నాడు..రేపు సూపర్‌ 8 అంటాడు..ఆ తర్వాత సూపర్‌ 80 అంటాడు. 
– ఆయన చాంతాడంత హామీలిచ్చినా ప్రజల్లో ఉన్న భావం ఒకటే. చంద్రబాబు చెప్పి ఎగ్గొడతాడు..జగన్‌ గారు చెప్పింది చెప్పినట్లు ఇంటికి చేరుస్తాడు.
– ఆ నమ్మకం, విశ్వాసం జగన్‌ గారికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. 
– చంద్రబాబు యాత్రలు, జగన్‌ గారి యాత్రలను భేరీజు వేసుకోండి. మీకే అర్ధం అవుతుంది. 
– చంద్రబాబుకు జనం రాక..గంటల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి వచ్చింది. 

ప్రజాగళం సభలతో చంద్రబాబు ప్రజలకు భరోసా ఇవ్వలేకపోతున్నాడు:
– నిన్న చంద్రబాబు పొదలకూరులో ప్రజాగళం అంటూ గళం విప్పాడు. 
– ముందు మూడు రోడ్ల జంక్షన్‌ అన్నాడు..తర్వాత జనాల్లో స్పందన లేదని రోడ్డు మీద పెట్టాడు. 
– చంద్రబాబు సభ 3 గంటలకు ప్రారంభం అవుతుందని చెప్పారు. గూడూరు కార్యక్రమం అయిపోయిన తర్వాత సుమారు గంటన్నర వెయిట్‌చేశాడు.
– ఆయన చెప్పిన 3 గంటలకు కనీసం వంద మంది కూడా రాలేదు.
– చంద్రబాబుకు పొదలకూరు మండల కేంద్రంలో లిబరల్‌గా లెక్కేసినా వచ్చిన జనం 1500 మంది.
– పొదలకూరు వచ్చి సోమిరెడ్డి రాసిచ్చిన స్క్రిప్ట్‌ చదివాడు. మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి సోమిరెడ్డి స్థాయికి దిగిపోయాడు.
– చంద్రబాబుకు పెద్ద స్థాయి ఉందా అంటే అదీ లేదు. రామారావు పిల్లనివ్వబట్టి చంద్రబాబు స్థాయి పెరిగింది అంతే. 
– రోజూ వాట్సప్‌లో వచ్చినవి ప్రింట్‌ అవుట్‌ తీసుకుని చదివి వెళ్లిపోయినట్లుంది. 
– పాము తోలు తీసుకొచ్చి దీనికి ప్రాణం పోస్తే, ఇది కాటేస్తే మనిషి బతకడు అని చెప్తున్నాడు.
– సోమిరెడ్డికి ఓటేసి గెలిపిస్తే అతను మీకు పనిచేస్తాడు అని చెప్తున్నాడు. 
– నువ్వు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేశావా? లేదా? నేను గుర్తు చేయాలా? 
– నువ్వు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు పొదలకూరుకు ఏం చేశావు..నీ వల్ల ఏం ఒనగూరిందో చెప్పాలి. 
– సర్వేపల్లి నియోజకవర్గానికి నీవల్ల ఏం ఒనగూరిందో చెప్తే బాగుండేది. 
– చంద్రబాబు వచ్చి నన్ను, జగన్‌ గారిని తిట్టడం తప్ప చేసిందేమీ లేదు. 
– నీ ప్రజాగళంలో ఇక్కడి ప్రజలకు నువ్వు ఏ రకంగా భరోసా ఇవ్వగలిగావు?

Back to Top