మంత్రి కాకాణి కి జననీరాజనం 

అట్టహాసంగా కొనసాగిన మంత్రి కాకాణి ఎన్నికల ప్రచారం 

సర్వేపల్లి నియోజకవర్గం, మనుబోలు మండలం, కొలనుకొదురు, కట్టువపల్లి గ్రామాలలో ఎన్నికల ప్రచారం 

 నెల్లూరు:  మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్ రెడ్డి నిర్వ‌హించిన ఎన్నిక‌ల ప్ర‌చారానికి విశేష స్పంద‌న ల‌భిస్తోంది. సర్వేపల్లి నియోజకవర్గం  మనుబోలు మండలం, కొలనుకొదురు, కట్టువపల్లి గ్రామాలలో మంత్రి ఎన్నికల ప్రచారం నిర్వ‌హించారు. బ్యాండ్ మేళాలు, తప్పెట్లు, భారీ పూలమాలలు, డప్పు వాయిద్యాలు, మహిళల మంగళ హారతులు, పెద్దల దీవెనలు, యువత కేరింతలతో భారీ సంఖ్యలో హాజరైన జన సందోహం మధ్య అత్యంత అట్టహాసంగా మంత్రి కాకాణి ఎన్నికల ప్రచారం కొన‌సాగుతోంది. 

ముఖ్యమంత్రిగా వైయ‌స్ జగన్ మళ్ళీ రావాలి.. శాసనసభ్యునిగా కాకాణి మళ్లీ గెలవాలి అంటూ నినాదాల‌తో హోరెత్తించారు.

 సర్వేపల్లి నియోజకవర్గంలో చివరి ఆయకట్టతో పాటు ప్రతి సెంటు భూమికి సాగునీరు అందిస్తామన్న హామీని నిలబెట్టుకున్న ఘనత వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందని మంత్రి కాకాణి పేర్కొన్నారు. త‌రతరాలుగా ఉన్న చుక్కల భూముల సమస్యను పరిష్కరించామని చెప్పారు. రైతులు సాగు చేసుకుంటున్న భూములకు పూర్తి హక్కులు కల్పిస్తూ పట్టాలు ఇచ్చామని మంత్రి తెలిపారు.

తెలుగు గంగ కాలువ నిర్మాణ పనులను పూర్తి చేసామని మంత్రి కాకాణి హామీ ఇచ్చారు. 2019 ఎన్నికలలో ఇచ్చిన ప్రతి హామీని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి నిలబెట్టుకున్నార‌ని పేర్కొన్నారు. నాడు నేడు పనులతో ప్రభుత్వ స్కూళ్లకు కార్పొరేట్ హంగులను తీసుకొని వచ్చామన్నారు.

క‌రోనా విలయతాండవం చేస్తున్న రోజులలో తాము ప్రజలతో మమేకమై ప్రజల కష్టనష్టాలలో అండగా ఉంటే.. మరోవైపు కిరాయి సోమిరెడ్డి తన ప్రాణాలు కాపాడుకునేందుకు హైదరాబాద్, బెంగళూరుకు పారిపోయాడని తీవ్రస్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు.

కరోనా కష్టకాలంలో ఎన్నో ఇబ్బందులు పడ్డామని.. పేద ప్రజల కోసం రైతులు దాతృత్వంతో బియ్యం అందిస్తే వాటిని ఇంటింటికి అందజేశామని పేర్కొన్నారు. కరోనా కష్టకాలంలో పేదలు ఇబ్బంది పడుతున్నారని ప్రతి ఇంటికి ప్రభుత్వం ఇచ్చే రేషన్ కు అదనంగా 3 కోట్ల రూపాయలు విలువైనటువంటి బియ్యం, వంటనూనె పంపిణీ చేశామన్నారు.

కరోనా కష్టకాలంలో ప్రజలను అంటిపెట్టుకొని అనేక విధాలైనటువంటి సేవలు అందించామని తెలిపారు. సోమిరెడ్డికి 2019 ఎన్నికలలో ఓట్లు వేసిన వారు కష్టాలలో ఉంటే వారి బాగోగులు పట్టించుకోకుండా వెళ్లిపోయిన నీచ చరిత్ర సోమిరెడ్డిదని విమర్శించారు. సోమిరెడ్డి గ్రామాలలో తిరుగుతూ ఇదే నా చివరి ఎన్నిక అని చెప్పుకుంటూ తిరుగుతున్నాడని, మీరు ఒక్కసారి ఓటు వేస్తే ఇక నీకు నాకు సంబంధం లేదని చెప్పడమే సోమిరెడ్డి ప్రధాన ఉద్దేశం అని వ్యంగంగా వ్యాఖ్యానించారు.

 తాను వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రతి రైతుకు గిట్టుబాటు ధర కంటే అదనంగా వచ్చేలా చర్యలు తీసుకున్నామని మంత్రి కాకాని తెలిపారు. తాను వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న ప్రస్తుత తరుణంలో రైతులు 30 శాతం అదనంగా 22 వేల నుంచి 24 వేల వరకు తమ ధాన్యాన్ని అమ్ముకోగలుగుతున్నారని తెలిపారు.

2014 ఎన్నికలలో టిడిపి, జనసేన, బిజెపి పార్టీలు కూటమిగా ఏర్పడి అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి రాగానే వాటిని మరిచిపోయారని మండిప‌డ్డారు. చంద్రబాబు దొంగ హామీలను ఎవ్వరూ నమ్మవద్దన్న మంత్రి  పిలుపునిచ్చారు. 2014 ఎన్నికలలో ప్రజలను మోసం చేసిన చరిత్ర చంద్రబాబుది అన్నారు. అయితే 2019 ఎన్నికలలో ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకున్న ఘనత ముఖ్యమంత్రి  వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారికి దక్కుతుందన్నారు. 2024 ఎన్నికలు రావడంతో తిరిగి బిజెపి, జనసేన, తెలుగుదేశం పార్టీలు కూటమిగా వస్తున్నాయని.. వారి కూటమికి గుణపాఠం నేర్పాలని పిలుపునిచ్చారు.

 2019 ఎన్నికలలో ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకున్న జగన్ మోహన్ రెడ్డి గారు కావాలా.. ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి మోసం చేసిన చంద్రబాబు కావాలా ఒక్కసారి ఆలోచన చేయండి అని ప్రజలను కోరారు.

చంద్రబాబు దొంగ హామీలు, సోమిరెడ్డి ముసలి కన్నీరు నమ్మితే ప్రజలందరూ నష్టపోతారన్నారు. కరోనా విలయతాండవం చేస్తున్న రోజులలో ప్రజలను పట్టించుకోకుండా వదిలేసి బెంగళూరు, హైదరాబాదులో దాసుకున్న సోమిరెడ్డి కావాలో.. లేక మీ ఇంటి బిడ్డగా నిత్యం మీకు అందుబాటులో ఉండి అన్ని రకాల సదుపాయాలు అందించిన నేను కావాలో మీరే ఆలోచించండి అని మంత్రి సూచించారు. రాబోయే సార్వత్రిక ఎన్నికలలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారితో పాటు తనను మరోసారి ఆశీర్వదించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Back to Top