కడుతున్న ఇళ్లు కూడా కనిపించని కబోదులు మీరు

గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ 

31 లక్షల మంది పేదలకు ఇళ్ళ స్థలాలు ఇచ్చినందుకు మీ ఏడుపా..?

3 సెంట్లల్లో బాబు నిర్మిస్తానన్న ఇళ్లు ఏమయ్యాయని రామోజీ ఎందుకు ప్రశ్నించడు?

 2023 మార్చి లోపల అక్కచెల్లెమ్మలు గృహప్రవేశాలు చేయబోతున్నారు

ఇళ్ళ నిర్మాణాల పురోగతిపై చర్చించడానికి నేను రెడీ, మీరు సిద్ధమా..?

మరే రాష్ట్రంలోనూ ఇంతపెద్దఎత్తున ఇళ్ళ నిర్మాణం జరగడం లేదు

చచ్చిన పార్టీని బతికించుకోవడం కోసమే బాబు ముందస్తు రాగం!

చంద్రబాబు వెన్నుపోటులో పదునైన కత్తి యనమల

మీరెన్ని కుట్రలు చేసినా 2024 ఎన్నికల్లో వార్ వన్‌ సైడే... 175కి 175 మావే

మంత్రి జోగి రమేష్

తాడేపల్లి: భారతదేశంలో ఇంత పెద్ద ఎత్తున ఇళ్ళ నిర్మాణ కార్యక్రమం మరే రాష్ట్రంలోనూ జరగడం లేదు.  పేదలకు ఒక శాశ్వత చిరునామా ఇస్తూ, లక్షల విలువ చేసే ఆస్తిని వారికి అప్పగిస్తున్నామ‌ని మంత్రి జోగి ర‌మేష్ తెలిపారు. జగనన్న ఇళ్ళ పట్టాలు ఇచ్చి, ఇళ్ళు నిర్మించి, మాకు శాశ్వత చిరునామా ఇస్తున్నారంచూ అక్కచెల్లెమ్మలు చెప్తున్న మాటలు చంద్రబాబు వినాలి. ఇంతగా అభివృద్ధి జరుగుతున్నా చంద్రబాబు గుడ్డి వాడిలా నటిస్తాడు. చెవిటి వాడి ముందు శంఖం ఊదినట్లుగా వ్యవహరిస్తున్నాడు. కడుతున్న ఇళ్లు కూడా కనిపించని కబోదులు మీరు అంటూ మంత్రి మండిప‌డ్డారు. గురువారం వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాల‌యంలో మంత్రి జోగి ర‌మేష్ మీడియాతో మాట్లాడారు.

3 సెంట్లల్లో బాబు నిర్మిస్తానన్న ఇళ్ళు ఏమయ్యాయని రామోజీ ఎందుకు ప్రశ్నించడు?
    వెంటిలేటర్‌ మీదున్న, వల్లకాడుకి తీసుకెళ్లడానికి రెడీగా ఉన్న టీడీపీని... మోకులు, తాళ్లు, బుల్డోజర్లు పెట్టి లేపడానికి ఈనాడు రామోజీరావు తెగ తాపత్రయపడుతున్నాడు. రోజూ ఏదో ఒక విధంగా ప్రభుత్వంపై లేనిపోని వార్తలు రాసి టీడీపీని జాకీలతో పైకి లేపాలని తెగ తాపత్రయపడుతున్నాడు. ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో ఇళ్ల నిర్మాణాలు కష్టాల్లో ఉన్నాయని ఈ రోజు అసత్యపు రాతలు రాశాడు. నిత్యం కుట్రలతో, కుయుక్తులతో ప్రభుత్వంపైన విషం చిమ్ముతూ కళ్లుండీ చూడలేని కబోదిలా ఈనాడు రామోజీ వార్తలు రాస్తున్నారు. ఆ పనికిమాలిన వార్తలను పట్టుకుని టీడీపీ నేతలు, చంద్రబాబు ప్రెస్‌మీట్లు పెట్టి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. "14 ఏళ్లు ముఖ్యమంత్రి చేశావ్‌... మీ మేనిఫెస్టోలో మూడు సెంట్ల స్థలం ఇచ్చి పూర్తిగా ఇళ్లనిర్మాణం చేసి ఇస్తానని హామీ ఇచ్చావు కదా... మరి, అమలు చేశావా.. ఎందుకు అమలు చేయలేదు అని ఈనాడు రామోజీ కూడా ఏనాడూ ప్రశ్నించడు. మూడు సెంట్లు సంగతి దేవుడెరుగు.. కనీసం ఒక్క సెంటు ఇళ్ళ స్థలం అయినా, ఏ ఒక్క పేదకు అయినా ఇచ్చావా బాబూ.?". తన హయాంలో చంద్రబాబు ఇళ్ల స్థలాలు ఇచ్చి ఉంటే.. ఇప్పుడు మా నాయకుడు శ్రీ వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి 31 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఎలా ఇస్తారు..?. ఇంత సింపుల్ లాజిక్ కూడా ఈనాడు రామోజీరావుకు ఎందుకు తట్టదు.?

31 లక్షల మందికి ఇళ్ళ స్థలాలు ఇస్తే చంద్రబాబు, రామోజీ ఏడుపు..
        రాష్ట్రంలో నీడ లేక అద్దె ఇళ్లలో ఉంటున్న 31 లక్షల మంది అక్కచెల్లెమ్మల పేరుతో రిజిస్ట్రేషన్లు చేసి,  ఇళ్ల పట్టాలు  వారి చేతుల్లో పెట్టిన మనసున్న ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌. పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తే చంద్రబాబు, రామోజీ ఏడుస్తారు. మరోవైపు జగనన్న కాలనీల పేరుతో రాష్ట్రవ్యాప్తంగా శరవేగంగా ఇళ్ల నిర్మాణాలు జరుగుతుంటే కుళ్లుతో విషం చిమ్ముతూ రాతలు రాస్తున్నారు. మొదటి రెండు విడతలకు 18.63 లక్షల నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నాయి.  చంద్రబాబునాయుడు, లోకేష్‌ సహా అందరూ రండి... పనులు ఏ విధంగా అక్కచెల్లెమ్మలు దగ్గరుండి ఇళ్లు కట్టుకుంటున్నారో చూపిస్తాం. అక్కచెల్లెమ్మలందరూ వచ్చే ఏడాది మార్చి లోపు ఆ ఇళ్లలో గృహప్రవేశాలు చేయబోతున్నారు కూడా. ఇళ్ల నిర్మాణ పురోగతిపై చర్చించడానికి రమ్మని సవాలు విసురుతున్నా... మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడి వస్తాను... పురోగతి చూపడానికి ఏ జిల్లాకు రమ్మన్నా వస్తానని చంద్రబాబు అండ్‌ కో కి చెప్తున్నా. 

మరే రాష్ట్రంలోనూ ఇంతపెద్దఎత్తున ఇళ్ళ నిర్మాణం జరగడం లేదు
    భారతదేశంలో ఇంత పెద్ద ఎత్తున ఇళ్ళ నిర్మాణ కార్యక్రమం మరే రాష్ట్రంలోనూ జరగడంలేదు. పేదలకు ఒక శాశ్వత చిరునామా ఇస్తూ, లక్షల విలువ చేసే ఆస్తిని వారికి అప్పగిస్తున్నారు. జగనన్న ఇళ్ళ పట్టాలు ఇచ్చి, ఇళ్ళు నిర్మించి, మాకు శాశ్వత చిరునామా ఇస్తున్నారంచూ అక్కచెల్లెమ్మలు చెప్తున్న మాటలు చంద్రబాబు వినాలి. ఇంతగా అభివృద్ధి జరుగుతున్నా చంద్రబాబు గుడ్డి వాడిలా నటిస్తాడు. చెవిటి వాడి ముందు శంఖం ఊదినట్లుగా వ్యవహరిస్తున్నాడు. మరో వైపు సిగ్గు, ఎగ్గూ లేకుండా మా నాయకుడు జగన్‌ గారు పెట్టిన పథకాలలనే తాను ఇస్తాను అంటాడు... దీని అర్ధం చంద్రబాబు కూడా.. జగనన్న పథకాలను మెచ్చి..  జై జగన్‌ అనడమే కదా. తన బ్రాండ్ ఇది అని చెప్పుకునే విధంగా,  కనీసం ఒక్క పథకమైనా చంద్రబాబు డిక్షనరీలో లేనే లేదు. ఈ మూడున్నరేళ్ల కాలంలో జగన్మోహన్‌ రెడ్డి గారు 32 పథకాలు పెట్టి వాటిని ప్రతి ఒక్క గడపకు చేరుస్తున్నారు. పేదలకు పథకాల ద్వారా నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తుంటే.. పేదలకు డబ్బులిస్తే, రాష్ట్రం శ్రీలంకగా మారుతోందని...ఆర్ధికంగా ఇబ్బంది ఉంటుందని... మరోవైపు అదే చంద్రబాబు మాట్లాడతాడు. తన అనుకూల పత్రికల్లో కూడా పథకాలు తీసేయాలని రాతలు రాయించిన పెద్ద మనిషి చంద్రబాబు. చంద్రబాబు నైజాన్ని ప్రజలు గమనించాలి అని మనవి. 

చచ్చిన పార్టీని బతికించుకోవడం కోసం బాబు ముందస్తు రాగం!
    ప్రజల్ని పక్కదోవ పట్టించడానికి ముందస్తు ఎన్నికలు అంటూ చంద్రబాబు కొత్త డ్రామాకు తెరతీశాడు. చచ్చిపోయిన తన పార్టీని బతికించుకోవడానికి, నాయకులను బుజ్జగించుకోవడానికి ముందస్తు ఎన్నికలంటూ కొత్త రాగం అందుకున్నాడు. ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే వస్తాయి...ముందస్తు ఎన్నికలు రావు. చంద్రబాబు నాయుడు కుప్పంలో కూడా ఓడిపోబోతున్నాడు. పచ్చ కామెర్ల రోగికి అంత పచ్చగానే కనిపిస్తుంది అన్నట్లు యనమల రామకృష్ణుడు అవినీతి ఆరోపణలు చేస్తున్నాడు. చంద్రబాబు ఆనాడు ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిస్తే.. ఆ వెన్నుపోటుకు ఉపయోగించిన పదునైన కత్తి మాత్రం యనమల రామకృష్ణుడే. వీరద్దరూ కలిసి పన్నిన కుట్రే ఎన్టీఆర్‌ను పొట్టనపెట్టుకోవడం. 

మీ ఆస్తులపై సీబీఐ విచారణకు సిద్ధమా?
            చంద్రబాబు, యనమల తమ ఆస్తులపై సీబీఐ విచారణకు సిద్ధమేనా..? అని ఛాలెంజ్ విసురుతున్నా.  సీబీఐ అనగానే పది నిమిషాల్లో స్టే తీసుకొస్తారు. మీ చరిత్ర మాకు తెలియదు అనుకోవద్దు. పోలవరాన్ని యనమల వియ్యంకుడికి ఎలా కట్టబెట్టారో మాకు తెలియదు అనుకోవద్దు. మీ పాపం పండింది కాబట్టి, మీరు చరిత్ర హీనులుగా మిగిలిపోయారు. మీరు ఈ ప్రభుత్వంపై ఎంతగా బురద చల్లాలని చూసినా 2024 ఎన్నికల్లో వార్ వన్‌ సైడే. 175 కి 175 స్థానాల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ విజయదుందిభి మోగిస్తుంది. చంద్రబాబు ఎన్ని పొత్తులు పెట్టుకున్నా... ఎంతగా పొర్లాడినా ఐదు కోట్ల తెలుగు ప్రజలు మాత్రం ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి వెంటే ఉన్నారు. చంద్రబాబు ఎన్ని కనికట్టు విద్యలు చేసినా ఇదేం ఖర్మరా బాబూ అంటూ ప్రజలు ఛీ కొడుతున్నారు. 

 2019 నుంచి 2020 వరకూ పీఎంఏవై గ్రామీణ ఇళ్లు రాష్ట్రానికి మంజూరు కాలేదు. వాళ్లు చెప్తున్న ఐదిళ్లు చంద్రబాబు హయాంలో ఇచ్చినవే. 2020-21 ఏడాదికి కేంద్రం 1.79  లక్షల ఇళ్లను పీఎంఏవై గ్రామీణ కింద కేటాయించింది. వీటిని ఈ ఏడాది ఏప్రిల్‌ 28న వైజాగ్‌లో జగన్మోహన్‌రెడ్డి గారు ప్రారంభించారు. వాటిలో ఇప్పటివరకూ 70 వేల ఇళ్ల నిర్మాణాలు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. ఇవన్నీ తెలుసుకోలేని నిరక్షర జ్ఙానులు ఏదేదో మాట్లాడుతున్నారు. పీఎంఏవై అర్బన్, రూరల్‌ కలుపుకుని 18 లక్షల ఇళ్లు మన రాష్ట్రానికి కేటాయిస్తే...అవి వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. ఇప్పటికే 3 లక్షల ఇళ్ల నిర్మాణం దాదాపు పూర్తయ్యింది. టిడ్కో ఇళ్ల నిర్మాణం చాలా చోట్ల పూర్తయ్యాయి. పూర్తయిన చోట లబ్ధిదారులకు ఇవ్వడం కూడా జరిగింది. కావాలంటే క్షేత్రస్థాయిలోనే చూపిస్తా. 
- కొన్ని పత్రికలు, చానళ్లు ఏమీ సంబంధం లేకపోయినా పనిగట్టుకుని పనికిమాలిన రాతలు రాస్తూ ఉంటాయి. అవినీతి మరక ఉండకూడదు అని ముఖ్యమంత్రి గారు చెప్పారు. మా ప్రభుత్వంలో అవినీతికి ఆస్కారం లేనే లేదు. 

Back to Top