బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల ప్రతిరూపం వైయస్‌ జగన్‌ 

మంత్రి గుమ్మనూరు జయరాం
 

అమరావతి: బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల ప్రతిరూపం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అని మంత్రి గుమ్మనూరు జయరాం కొనియాడారు. మంగళవారం సభలో ఆంధ్రప్రదేశ్‌ కార్మిక సంక్షేమ నిధి చట్టం 1987 సవరణ బిల్లును మంత్రి ప్రవేశపెట్టారు. ఈ చట్టాన్ని  ఏపీ సంక్షేమ నిధి బోర్డును ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ బోర్డు పనితీరును మెరుగుపరిచేందుకు, సంక్షేమ పథకాలన్నింటిని చివరి లబ్ధిదారుడి వరకు మరింత పారదర్శకంగా అందించేందుకు,  కార్మికుల ప్రయోజనాల కోసం ఏపీ కార్మిక సంక్షేమ బోర్డులో సభ్యుడిగా, వైస్‌ చైర్మన్‌ను ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదించామని తెలిపారు. ఇందుకోసం చట్టంలోని 4 సెక్షన్‌ను సవరించాల్సి ఉందని, ఈ బిల్లును సభ ఆమోదించాలని మంత్రి గుమ్మనూరు జయరాం కోరారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

గతేడాది వైయస్‌ జగన్‌ గురించి యుగ పురుషుడు అని మాట్లాడితే భజన అని దుష్ప్రచారం చేశారన్నారు. ఇవాళ నా మనసులోని భావాన్ని చెబుతున్నానని తెలిపారు. మూడేళ్ల తరువాత వైయస్‌ జగన్‌ ప్రవేశపెట్టిన పథకాలు..కలియుగాన్ని సృష్టించిన ముగ్గురు వ్యక్తులను గుర్తు చేస్తున్నాయి. ఈ ముగ్గురు వ్యక్తులు నవరత్నాల ద్వారా వైయస్‌ జగన్‌లో కనిపించారు.  ఆ ముగ్గురు బ్రహ్మ, విష్ణు,   మహేశ్వర..ఇది భజన కాదు. నా మనసులో నుంచి వచ్చేది. ఆనాడు రామాయణం రచించిన వాల్మీకికి రామ అని పలకడానికి రాదు. మరా మరా అని స్మరించి రామాయణం  నేను కూడా నా మనసులో నుంచి వచ్చిన మాటలు చెబుతున్నాను. 

బ్రహ్మ: బ్రహ్మరాతను మార్చాలంటే డబ్బు కావాలి. కుటుంబాన్ని పోషించాలంటే డబ్బులు కావాలి. పిల్లలకు చదువులు చెప్పించాలంటే డబ్బులు కావాలి. చదువుల కోసం వైయస్‌ జగన్‌ అమ్మ ఒడి, జగనన్న వసతి దీవెన, జగన న్న విద్యా దీవెన, విదేశీ విద్యా దీవెన ఇచ్చారు.  ఈ రోజు వైయస్‌ జగన్‌ డబ్బులు ఇచ్చి వాళ్ల తలరాతలు మార్చుతున్నారు. మా అందరికీ పదవులు ఇచ్చి మమ్మల్ని ఏపీ ప్రజలకు పరిచయం చేశారు. 

శివుడు: అనగా కుటుంబాలను పోషించేవారు. ఇవాళ వైయస్‌ జగన్‌ కాపు నేస్తం, నేతన్న నేస్తం, చేదోడు పథకాలు ఇచ్చి కుటుంబాలను పోషించేందుకు డబ్బులు ఇచ్చారు. ఈబీసీ నేస్తం పథకం ద్వారా అగ్రవర్ణ పేదలను ఆదుకున్నారు.

విష్ణువు:  చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నన్ని రోజులు రాష్ట్రంలో కరువు పరిస్థితులే. వైయస్‌ రాజశేఖరరెడ్డి సీఎం అయ్యాక 2004లో బ్రహ్మండమైన వర్షాలు కురిశాయి.  వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయ్యాక మూడేళ్లుగా బ్రహ్మండమైన వర్షాలు కురుస్తున్నాయి. ప్రజలు ధీమాగా బతుకుతున్నారు. ఐదు కోట్ల ప్రజలను కాపాడుతున్న వైయస్‌ జగన్‌ను ఆ దేవుడు చల్లగా చూడాలని గుమ్మనూరు జయరాం కోరారు.
 
 

Back to Top