బోయ కులానికి వాల్మీకి మహర్షి మా జగనన్న

కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం
 

 

అమరావతి: బీసీలకు పెద్దపీట వేసిన ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నానని కార్మిక, ఉపాధి, శిక్షణ, ఫ్యాక్టరీ శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం అన్నారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. బ్రహ్మ రాత రాస్తాడని అందరూ అంటుంటారు బ్రహ్మ రాశాడో లేదో తెలియదు కానీ.. మా జగనన్న మా అందరికీ రాత రాశారన్నారు. వాల్మీకి బోయ కులానికి చెందిన తనకు మంత్రి పదవి కల్పించడం మా జగనన్నకే సాధ్యమైందన్నారు. బోయ కులానికి వాల్మీక మహర్షి సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఎస్సీలకు అంబేడ్కర్‌ లాంటి వారు.. ముస్లింలకు అల్లా, క్రిస్టియన్స్‌కు జీసస్‌ లాంటి వ్యక్తి మన సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అని వివరించారు. రాజకీయాలు ఎన్నికల వరకే ఉండాలి. ఎన్నికల తరువాత అందరూ సమానమేనని మాట చెప్పారన్నారు.

తాజా ఫోటోలు

Back to Top