నంద్యాల: వైయస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండటం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చేసుకున్న అదృష్టమని మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం కల్వటాల గ్రామంలో రామ్‌కో సిమెంట్ నూతన యూనిట్ ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడారు. రాష్ట్రంలో మూడేళ్లలో పారిశ్రామిక అభివృద్ధి గురించి మొన్ననే సీఎం వైయస్ జగన్ శాసన సభలో వివరించారు. రానున్న రోజుల్లో రాష్ట్రాన్నిపారిశ్రామికంగా ప్రగతిపథంలో తీసుకెళ్లేందుకు సీఎం వైయస్ జగన్ పడుతున్న తపన, తాపత్రయం గురించి చెప్పాల్సిన పని లేదు. ఇప్పటికే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టిన పారిశ్రామిక వేత్తలు, వారి సంస్థలకు ఈ ప్రభుత్వం ఏరకంగా ప్రోత్సహకాలు, సహకారం అందిస్తుందో నిలువెత్తు నిదర్శనం మొన్న జరిగిన ఈజ్ ఆఫ్ డూయింగ్ ర్యాంకే ఉదాహరణగా చెప్పవచ్చు. ఏపీ ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటిస్‌గా చెప్పుకోవచ్చు. ఈ రాష్ట్రానికి ఉన్న సముద్రతీరం ఒక అడ్వాంటేజ్‌గా చెప్పుకోవచ్చు. నేషనల్ హౌవే కనెక్టివిటీ, పోర్ట్ కనెక్టివిటీ, ఇన్‌ఫ్రాక్చర్ డెవలప్‌మెంట్ ఇవన్నీ కూడా పరిశ్రమల అభివృద్ధికి దోహదపడుతాయి. ఈ రాష్ట్రానికి ఒక గొప్ప ముఖ్యమంత్రి ఉండటం మనం చేసుకున్న అదృష్టం. ర్యామ్‌కో ప్లాంట్‌ను ఈసందర్భంగా కొలిమిగుండ్ల మండలంలో మూడో యూనిట్ ప్రారంభించడం సంతోషంగా ఉందని మంత్రి అమర్నాథ్ తెలిపారు.