సీఎం వైయ‌స్ జ‌గ‌న్ వ‌ల్లే ఏపీ అగ్ర‌స్థానం

 
నారాయణ స్కూల్ ర్యాంకులా లోకేష్‌ ప్రచారం

32 లక్షల కోట్ల ఎంవోయూలు అన్నారు.. 50వేల కోట్ల పెట్టుబడులు కూడా రాలేదు

మంత్రి మేక‌పాటి గౌతంరెడ్డి

 అమరావతి : సీఎం వైయ‌స్ జగన్ పారదర్శక పాలన వల్లే ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌‌లో ఆంధ్రప్రదేశ్‌ తొలిస్థానం సాధ్యమైంద‌ని మంత్రి గౌతమ్‌ రెడ్డి పేర్కొన్నారు.  సీఎం వైయ‌స్ జగన్ విధానాలపై పెట్టుబడిదారులు సంతృప్తిగా ఉన్నార‌ని వ్యాఖ్యానించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకు విష‌యంలో టీడీపీ చేస్తున్న అసత్య ప్రచారాన్ని మంత్రి ఖండించారు. సోమ‌వారం మంత్రి గౌతంరెడ్డి మీడియాతో మాట్లాడారు.

లోకేష్ ట్వీట్లు దిగ‌జారుడు త‌నానికి నిద‌ర్శ‌నం

గత టీడీపీ పాలన వల్లనే మొదటి ర్యాంక్‌ వచ్చినట్లు ప్రచారం చేసుకోవడం ఆ పార్టీ నేతల దిగజారుడు తననానికి నిదర్శమని గౌతంరెడ్డి అన్నారు. టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్‌ ట్వీట్‌లు దిగజారి ఉన్నాయని, 10వ తరగతి ఫలితాల రోజు నారాయణ స్కూల్ ర్యాంకులు ప్రచార చేసినట్టు చేస్తున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సర్వే ప్రక్రియ 2019 ఏప్రిల్ నుంచి 2020 మార్చి వరకు జరిగిందని, ఈ సమయంలో రాష్ట్రంలో ఎవరి ప్రభుత్వం ఉందో చూసుకోవాలిన హితవు పలికారు. అబద్ధాలతో లోకేష్‌ భవిష్యత్‌కే నష్టమన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్‌ బిజినెస్ అనేది ఎంఎస్‌ఈలకు ఉపయోగపడుతుందని, 2019 ఆగస్ట్‌లో రాష్ట్రంలో చేపట్టిన సంస్కరణల డేటా పంపినట్లు వివరించారు.  

అప్ప‌టి..ఇప్ప‌టి ర్యాంకుల‌కు చాలా తేడా ఉంది..

టీడీపీ పాల‌న‌లో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కు వ‌చ్చిన ర్యాంక్‌కు, ఇప్పుడొచ్చిన ర్యాంక్‌కు చాలా తేడా ఉంద‌ని మేక‌పాటి గౌతంరెడ్డి వివ‌రించారు. మొట్టమొదటి సారి సర్వే చేసి ఫలితాలు ఇచ్చారు. గతంలో ప్రభుత్వం ఎవరిని సూచిస్తే వారితోనే సర్వే చేశారు. అది కూడా కేవలం 10 శాతం మాత్రమే సర్వే చేశారు. 32 లక్షల కోట్ల ఎంవోయూలు అన్నారు. 50వేల కోట్ల పెట్టుబడులు కూడా రాలేద‌ని పేర్కొన్నారు.  ప్రభుత్వం 20 ఏళ్లూ పెనాల్టీ కట్టే రీతిలో రాయితీలు పెట్టారు. మా వల్ల పరిశ్రమలు, పెట్టుబడులు వెళ్లిపోతున్నాయని దుష్ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు టీడీపీ నేతలు ఏం సమాధానం చెప్తార‌ని గౌతంరెడ్డి నిల‌దీశారు.  
 

Back to Top