శ్రీకాకుళం: నిస్సహాయులకు అండగా జగనన్న సురక్ష కార్యక్రమమని రెవెన్యూ శాఖామాత్యులు ధర్మాన ప్రసాదరావు అన్నారు. శ్రీకాకుళం నగరపాలక సంస్థ పరిధిలోని హడ్కో కాలనీ, పిఎస్ఎన్హెచ్ స్కూల్ గ్రౌండ్, గార మండలంలో రామచంద్రపురం, శాలిహుండం పంచాయతీలలో ఏర్పాటు చేసిన జగనన్న సురక్ష క్యాంప్ లో మంత్రి ధర్మాన పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారుల సమస్యలు, సామాజిక సమస్యలు తెలుసుకున్నారు. సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి నిర్దేశిత లక్ష్యాల మేరకు అంతా కలిసి పనిచేయాలని మంత్రి పిలుపునిచ్చారు. సంక్షేమ పథకాలకు నిరాంటకంగా అందుతున్నాయో లేదో తెలుసుకునేందుకు ఈ విధంగా ప్రజల ముందుకు వచ్చి సంబంధిత క్షేత్ర స్థాయి వాస్తవాలు తెలుసుకుంటున్నామని రెవెన్యూ శాఖామాత్యులు ధర్మాన ప్రసాదరావు అన్నారు. నాలుగేళ్లుగా జగన్ అందిస్తున్న సుపరిపాలన ఏ విధంగా ఉందో తెలుసుకునేందుకు, అలానే ఇతర వ్యక్తిగత, సామాజిక సమస్యల నివృత్తికి లేదా పరిష్కారానికి పనిచేసేందుకు ప్రాధాన్యం ఇస్తూ ఈ కార్యక్రమ నిర్వహణ ఉంటోందని అన్నారు. ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాలలో పనులు ఆలస్యంగా అవుతాయి అన్న అపోహను తొలగించేందుకు జగన్ సర్కారు తీవ్ర కృషి చేస్తోందని, ఇందులో భాగంగానే అధికారులను అప్రమత్తం చేస్తూ పని చేయిస్తోందని, అలానే వలంటీర్లు, గృహ సారథులు, గ్రామ సచివాలయ కో - ఆర్డినేటర్ల సాయంతో ఇంటింటి సర్వే ను నిర్వహిస్తోంది అని దీనిని కూడా ప్రజలు చక్కగా వినియోగించుకోవాలి అని కోరారు. జగనన్న సురక్ష కార్యక్రమంలో భాగంగా నెల రోజుల పాటు జరుగుతుంది అని, వివిధ పథకాల లబ్ధిదారులందరినీ కలుస్తాం అని అన్నారు. ప్రజలకు ఇంత మంచి జరుగుతున్నా ఓర్వలేని మీడియా సంస్థలు (టీడీపీకి చెందిన మాధ్యమాలు (యెల్లో మీడియా) ప్రభుత్వం తప్పు చేస్తునట్టు చూపిస్తున్నారు అని,ఇది తగదు అని హితవు చెప్పారు. విపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు ఆనాడు అడ్డగోలుగా పనులు చేసి, రాష్ట్రాన్ని ఏ విధంగానూ అభివృద్ధి చేయలేదని విమర్శించారు. ఇన్ని పథకాలకు ఒక్కరైనా నయా పైసా లంచం అడిగిన దాఖలాలు కానీ లేదా ఇచ్చిన దాఖలాలు కానీ లేవు. అలానే 2.3 లక్షల కోట్ల రూపాయలను, నేరుగా ఖాతాలకు జమ చేశాం. ఈ విషయమై మధ్యవర్తుల ప్రమేయం లేకుండా ఇచ్చాం. 500 కోట్ల రూపాయలు వెచ్చించి 12,000 మందికి ఇళ్ళ పట్టాలు ఇచ్చాము. అదేవిధంగా ఇవాళ ఊళ్లల్లో ఉన్న స్కూల్స్ మారాయి. ఇదంతా నాలుగేళ్లు ముందు అందరూ ఓటు వేసి గెలిపించిన వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం వల్లనే సాధ్యం అయింది. ఇవాళ ప్రభుత్వ పాలన మీ గుమ్మం దగ్గర కు తీసుకు వచ్చాము. సచివాలయాలతో పాటు రిమ్స్ ను చూడండి. గడించిన కాలం లో ఎలా ఉందో యిప్పుడు ఎలా ఉందో చూడండి. 900 బెడ్స్ అందుబాటులోకి తీసుకు వచ్చాము. అలానే 40 కోట్ల రూపాయలతో పట్టణంలో ఉన్న అని ప్రాంతాలకు త్రాగు నీరు అందించాము. అవినీతి లేని పాలన అందిస్తున్నాం అవినీతి లేకుండా చేయాలనే లక్ష్యంతో పాలన సాగిస్తున్నాం అని అన్నారు. మ్యానిఫెస్టో ప్రకారం 98 శాతం ఇచ్చిన హామీలు అని అమలు చేశాం అని తెలిపారు. పథకాల అమలులో భాగంగా మీ ఇంటి మేడ మీద ఏ పార్టీ జెండా కట్టారో అన్నది చూడలేదు అని విన్నవిస్తూ, అన్ని పథకాలనూ గౌరవంగా అందించిన ఘనత ఈ ప్రభుత్వానిదే అని చెప్పారు. ఇవాళ పేదరికం అర్హతగా పథకాలు అమలవుతున్నాయన్నారు. అదేవిధంగా సంక్షేమం,అభివృద్ధి అన్నవి ప్రాధాన్యాంశాలుగా తీసుకుని ప్రధానంగా విద్య,వైద్య రంగాలలో సమూల మార్పులు తీసుకుని వచ్చామని తెలిపారు. ఆర్డీవో శాంతి, మున్సిపల్ కమిషనర్ చల్లా ఓబులేసు, సాదు వైకుంఠ రావు, డాక్టర్ పైడి మహేశ్వర రావు, కోణార్క్ శ్రీనివాస్ రావు, చల్ల శ్రీనివాసరావు, అబోతుల రామ్ మోహన్, పండరి నాథ్, చిట్టి రవి, అలుగుబెల్లి నాగభూషన్, చిట్టి రవి కుమార్, రఫీ, ఎండ రమేష్, టంకాల బాలకృష్ణ, మోహన్, వనపల్లి రమేష్, గంగాధర్, గార మండలంలో జరిగిన కార్యక్రమంలో ఎంపిపి గోండు రఘురాం, ఎంఆర్వో రామారావు, మాజీ డిసీఎంఎస్ చైర్మన్ గోండు కృష్ణ, ముంజెటి కృష్ణ, పీస గోపి, పీస శ్రీహరి,కొయ్యణ నాగబుషన్, గోలివి రమణ, మార్పు పృథ్వి, శీర సత్యం, తదితరులు పాల్గొన్నారు