ప్ర‌జాభీష్టం నెర‌వేర్చ‌డ‌మే ప్ర‌థ‌మ ధ్యేయం             

 రెవెన్యూ మంత్రి ధ‌ర్మాన ప్రసాద‌రావు ధ‌ర్మాన 
 
ఆడ‌వ‌రంలో గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ మ‌న ప్ర‌భుత్వం

శ్రీ‌కాకుళం: ప్ర‌జాభీష్టం నెర‌వేర్చ‌డ‌మే ప్ర‌భుత్వ‌ ప్ర‌థ‌మ ధ్యేయమ‌ని  రెవెన్యూ మంత్రి ధ‌ర్మాన ప్రసాద‌రావు ధ‌ర్మాన అన్నారు.  గార మండ‌లంలోని అంపోలు-2 సచివాలయం పరిధిలోని ఆడ‌వ‌రం, పిల‌క‌వానిపేట గ్రామాల‌లో రెవెన్యూ మంత్రి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు నేతృత్వాన గ‌డ‌ప గ‌డ‌ప‌కూ మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. ల‌బ్ధిదారుల‌తో మ‌మేకం అయి ప‌థ‌కాల అమ‌లు తీరును వారిని అడిగి తెలుసుకున్నారు. అనంత‌రం ఆడ‌వ‌రంలో ఏర్పాటు చేసిన స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ.. "ఈ ప్ర‌భుత్వం అధికారం లోకి వ‌చ్చి మూడేళ్ల‌యింది. ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల‌కు అనుగుణంగా ప్ర‌భుత్వం చేసిన పాల‌న మీద ఐదేళ్ల‌కొక‌సారి తీర్పు అన్న‌ది ఉంటుంది.  ఆ రోజు ఏ కార్య‌క్ర‌మాల‌నైతే చేస్తామ‌ని చెప్పామో  వాటిని అన్నింటినీ నిర్వ‌ర్తించేందుకు, అదేవిధంగా హామీలను అమలు చేసేందుకు కృషి చేస్తున్నాం. ఇదే సమ‌యాన ఓట‌ర్ల అభిప్రాయం ఏంట‌న్న‌ది తెలుసుకునేందుకే గ‌డ‌ప గ‌డ‌ప‌కూ మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తున్నాం. 

ఈ ప్ర‌భుత్వం చేస్తున్న కార్య‌క్ర‌మం బాగుందా లేదా అన్న‌ది తెలుసుకునేందుకే  గ‌డ‌ప గ‌డ‌ప‌కూ  వ‌స్తున్నాం. ఇందులోభాగంగానే రాష్ట్రమంతా ఇదే విధంగా తిరుగుతూ ప్ర‌జాభిప్రాయాన్ని వినేందుకు, స‌మ‌స్య‌ల‌ను గుర్తించేందుకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాం. ఏడాది పాటు ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తాం. కొంత మందికి కొంత  అవ‌గాహ‌న లేక‌పోవ‌డం వ‌ల్ల ప‌థ‌కాల అమ‌లు విష‌య‌మై కొంత  సందేహాలు వ‌స్తున్నాయి. వాటిని వ‌లంటీర్లు నివృత్తి చేయాలి. అదేవిధంగా గ్రామ స‌చివాల‌య సిబ్బంది కూడా  సందేహాల నివృత్తికి కృషి చేయాల్సి ఉంది. అదేవిధంగా అందరి పిల్ల‌ల‌నూ చ‌దివించే ఏర్పాటుకు అనుగుణంగా ఆ త‌ల్లి అకౌంట్-కు మూడేళ్ల పాటు ఏడాదిపాటు 15  వేల  చొప్పున  జ‌మ చేస్తూ ఇప్ప‌టిదాకా అమ్మ ఒడి పథ‌కం అమ‌లు చేశాం. 

సంక్షేమ ప‌థ‌కాల అమ‌లులో అన్ని వ‌ర్గాల‌కూ ప్రాధాన్యం ఇస్తున్నాం. అలానే  కొంద‌రు కొన్ని త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నారు.  వాటిని  తిప్పికొట్టాలి. ఆక‌లి, క‌న్నీరు ఉన్న కుటుంబాల‌కు  ఆదుకునేందుకు, వారి ఆత్మ‌గౌర‌వం కాపాడేందుకు కృషి  చేస్తున్నాం. అదేవిధంగామ‌హిళ‌ల‌కు సంబంధించి నాలుగు విడ‌త‌ల్లో ఇప్ప‌టిదాకా బ‌కాయి ఉన్న డ్వాక్రా గ్రూపు రుణాలు క‌డ‌తామ‌ని చెప్పాం. ఇప్ప‌టిదాకా మూడు విడ‌త‌ల్లో చెల్లించాం.  అంతా గౌర‌వంగా బ‌తికేవిధంగా చూస్తున్నాం. ప‌థ‌కాల‌కు అమ‌లుకు సంబంధించి ఆర్థిక చేయూత ఇవ్వ‌డం అన్న‌ది గౌర‌వంగా సాగేవిధంగా, పుచ్చుకోవ‌డం కూడా అదే స్థాయిలో గౌర‌వంగా జరిగే విధంగా ఉండేలా చేస్తున్నాం" అని చెప్పారు. అనంత‌రం ఆడ‌వ‌రం గ్రామంలో తాగునీటి స‌మ‌స్య పై  స్థానికుల విన్న‌పం మేర‌కు వారం రోజుల్లో స‌మ‌స్యను ప‌రిష్క‌రిస్తామ‌ని హామీ ఇచ్చారు. పిలకపేటకు త్రాగునీటిని అందించేందుకు సంబంధిత పనులు మూడు నెలల్లో పూర్తి చేస్తాం అని అన్నారు. ఆడ‌వ‌రం చెరువు ద‌గ్గ‌ర  స్మశాన వాటిక‌కు వెళ్లేందుకు వీలుగా రహ‌దారి నిర్మాణం చేపట్టాలని గ్రామ‌స్థులు కోర‌గా, పరిశీలించ‌మ‌ని సంబంధిత అధికారుల‌ను ఆదేశించారు.

 యువనేత ధర్మాన రామ్ మనోహర్ నాయుడు మాట్లాడుతూ, త‌మ ప్ర‌భుత్వం నేతృత్వాన అర్హులైన ప్ర‌తి ఒక్క‌రికీ సంక్షేమ ఫ‌లాలు  అందించేందుకు కృషి చేస్తున్నామ‌ని,  త‌మ‌ది పేద‌ల ప్ర‌భుత్వం అని అన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top