విమర్శలు పట్టించుకోం.. ప్రజల కోసమే పనిచేస్తాం

శ్రీరామతీర్థసాగర్‌ ద్వారా విజయనగరానికి నీళ్లు

మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ

విజయనగరం: శ్రీరామతీర్థ సాగర్‌ ద్వారా విజయనగరానికి నీళ్లు తీసుకొస్తామని మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. మంత్రి పదవి ఎన్నిసార్లు చేశామన్నది ముఖ్యం కాదని, ప్రజలకు కావాల్సిన పనులు చేయాలన్నారు. అనుభవం అని చెప్పుకునే చంద్రబాబు తన అనుభవంతో చేసిన ఒక్క మంచి పనైనా ఉందా..? అని ప్రశ్నించారు. విజయనగరంలో మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. శ్రీరామతీర్థసాగర్‌ నుంచి నీరు తీసుకురావాలని దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలోనే ప్రయత్నించామన్నారు. గత టీడీపీ ప్రభుత్వం కక్షతో ఆ ప్రాజెక్టును నిలిపేసిందన్నారు. శ్రీరామతీర్థ సాగర్‌ ద్వారా విజయనగరానికి నీళ్లు తీసుకొస్తామన్నారు. ప్రతిపక్షాలు పనికిరాని విమర్శలు ఎన్ని చేసినా పట్టించుకోమని, ప్రజల కోసమే పనిచేస్తామని చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటికే పేదలందరికీ ఇళ్ల పట్టాలు ఇస్తున్నామని గుర్తుచేశారు. మోసం, దగా లేకుండా రాష్ట్రంలో పాలన సాగుతోందన్నారు. మంచి చేయాలనే ఆలోచన చంద్రబాబుకు ఎప్పుడూ రాదని, జరిగే మంచిని కూడా అడ్డుకునేందుకు కుట్రలు చేయడం సిగ్గుచేటన్నారు. 
 

Back to Top