ఐదేళ్లూ చంద్రబాబు గ్రాఫిక్స్‌తో కాలం గడిపారు

హాలీవుడ్‌ సినిమాల్ని తలదన్నేలా గ్రాఫిక్స్‌ చూపించారు

చంద్రబాబు చెప్పిన దానికి, చేసిన దానికి పొంతన లేదు

40ఏళ్ల అనుభవం అంటే ఇదేనా చంద్రబాబూ?

మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి

సచివాలయం: చంద్రబాబు ఐదేళ్లు గ్రాఫిక్స్‌తో కాలం గడిపారని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి విమర్శించారు. డ్రీమ్‌ కేపిటల్‌ అంటూ హాలీవుడ్‌ సినిమాల్ని తలదన్నేలా గ్రాఫిక్స్‌ చూపించారని మండిపడ్డారు. చంద్రబాబు చెప్పినదానికి, చేసిన దానికి పొంతన లేదన్నారు. 40 ఏళ్ల అనుభవం అంటే ఇదేనా అని ప్రశ్నించారు. రాజధాని టెండర్లలో అవకతవకలు జరిగాయని పేర్కొన్నారు. రూ.5 వేల కోట్లు ఖర్చు చేసి 52 కోట్లకు టెండర్లు పిలుస్తారా అని ప్రశ్నించారు. రాజధాని ప్రకటనపై నోటిఫికేషన్‌ ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. కొత్త రాజధానుల నిర్మాణం కోసం కేంద్రం ఎన్ని నిధులిచ్చిందో తెలుసా అన్నారు. ఆస్తులన్నీ అమ్ముకుంటామని చంద్రబాబే చెప్పినట్లు గుర్తు చేశారు. రాజధాని కట్టాలనుకున్నారా..రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేయాలనుకుంటున్నారా అన్నారు. మీరేమైనా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎల్లోమీడియా ఉందని ఇష్టమొచ్చినట్లు చెప్పుకుంటూ పోతారా అని ప్రశ్నించారు. చంద్రబాబు వల్లే హైదరాబాద్‌ ఐటీ పరిశ్రమ అభివృద్ధి చెందలేదని తెలిపారు. హైటెక్‌ సిటీ బిల్డింగ్‌ కడితే హైదరాబాద్‌ కట్టినట్టా అని ప్రశ్నించారు. విశాఖపై  చంద్రబాబుకు ఎందుకంత కోపమన్నారు. విశాఖను ఎందుకు అభివృద్ధి చేయలేదని సూటిగా ప్రశ్నించారు. అమరావతిలో చంద్రబాబు ఎందుకు ఇల్లు కట్టుకోలేదని ప్రశ్నించారు. అక్రమ నిర్మాణంలో ఉంటూ రాజధానిపై చంద్రబాబు మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. 

Read Also: శునకానికి ఉన్న విశ్వాసంలో పదోవంతు కూడా బాబుకు లేదు

Back to Top