గత ప్రభుత్వ తప్పిదాలను సరిదిద్దుతున్నాం

ఎల్‌జీ పాలిమర్స్‌కు మా ప్రభుత్వం ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు

మంత్రి బొత్స సత్యనారాయణ

విశాఖ: ఎల్‌జీ పాలిమర్స్‌ కంపెనీ విషయంలో గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను ఈ ప్రభుత్వం సరిదిద్దుతుందని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. ఎల్‌జీ పాలిమర్స్‌కు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం కొత్తగా ఎలాంటి అనుమతులు ఇవ్వలేదన్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన అనుమతులతోనే ఆ పరిశ్రమ కొనసాగుతుందన్నారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో కంపెనీ కార్యాకలాపాలు కొనసాగించేందుకు అనుమతి కోరితే ఇచ్చామన్నారు. కంపెనీ మెయింటెన్స్‌ కోసం 40 పాస్‌లు కలెక్టర్ ఇచ్చారు. వారిలో 15 మంది కంపెనీలోకి వెళ్లారు. ఎవరిపై ప్రేమఈ ఘటనపై సీఎం వైయస్‌ జగన్‌ కమిటీలు ఏర్పాటు చేశారన్నారు. విచారణలో ఆ కంపెనీ తప్పని తేలితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఉపేక్షించే సమస్యే లేదన్నారు. నిపుణులు ఇచ్చిన నివేదిక మేరకే శానిటేషన్‌ పనులు చేపట్టామన్నారు. పారిశుద్ధ్య పనులు పూర్తి కాగానే గ్రామస్తులను అనుమతిస్తామన్నారు. వారితో పాటు మేం కూడా వెళ్తామన్నారు. 
 

Back to Top