వైయ‌స్ జగన్ ఎప్పుడు ఒంటరిగానే పోటీ చేస్తున్నారు

 మంత్రి బాలినేని శ్రీ‌నివాస‌రెడ్డి

ప్ర‌కాశం: పార్టీ పెట్టినప్పటి నుండి వైయ‌స్ జగన్ మోహ‌న్ రెడ్డి ఎన్నిక‌ల్లో ఒంటరిగానే పోటీ చేస్తున్నారని మంత్రి బాలినేని శ్రీ‌నివాస‌రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్‌, మెగాస్టర్ చిరంజీవి భేటీ అనంతరం చిరుకు రాజ్యసభ సీటు ఇస్తున్నారంటూ వచ్చిన రూమర్స్‌పై  మంత్రి బాలినేని శ్రీనివాస్ స్పందించారు. సినిమా వాళ్లకి ఉన్న ఇబ్బందులు గురించి చెప్పడానికి మాత్రమే సీఎం వైయ‌స్ జగన్‌ను చిరంజీవి కలిశారని స్పష్టం చేశారు. కొంత మంది దాన్ని కూడా రాజకీయం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. సినిమా వాళ్ల తరపున వచ్చి చిరంజీవి కలిస్తే ఏదో ఒకటి పులమాలని చూస్తున్నారన్నారు. చిరంజీవి, పవన్ కళ్యాన్ మధ్య చిచ్చు పెట్టే ఆలోచన మా పార్టీకి లేదని తేల్చిచెప్పారు.   చంద్రబాబు దళితులు, కాపుల మధ్య చిచ్చుపెడుతుంటారని మంత్రి బాలినేని శ్రీనివాస్ మండిపడ్డారు.  

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top