మంత్రి అయ్యన్నపాత్రుడుకి ఓటమి భయం

వైయస్‌ జగన్‌ సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారు

వైయస్‌ఆర్‌సీసీ నర్సీపట్నం అభ్యర్థి ఉమాశంకర్‌ గణేష్‌

నర్సీపట్నం: వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సీఎం కావాలని నర్సీపట్నం నియోజకవర్గం ప్రజలందరూ కోరుకుంటున్నారని వైయస్‌ఆర్‌సీపీ నర్సీపట్నం అభ్యర్థి ఉమాశంకర్‌ గణేష్‌ అన్నారు.నర్సీపట్నంలో వైయస్‌ జగన్‌ ఎన్నికల ప్రచారం సభలో ఆయన మాట్లాడారు. నియోజకర్గంలో ఎన్నో సమస్యలు ఉన్నాయన్నారు. నర్సీపట్నం మున్సిపాల్టీలో  టాక్స్‌లు 20 రెట్లు పెంచి ప్రజలపై పెనుభారం మోపారని మండిపడ్డారు. మంత్రిగా అయ్యన్నప్రాతుడు ఉన్నప్పుటికి రూపాయి పన్ను కూడా తగ్గించలేదన్నారు. అలాగే ఆసుపత్రి  పరిస్థితి దారుణం ఉందని,అత్యవసర పర్థితుల్లో వైజాగ్‌ వెళాల్సి వస్తుందన్నారు. జగన్‌ సీఎం అయిన వెంటనే ఆసుప్రతికి మెరుగైన సౌకర్యాలు కల్పించాలని కోరారు. నియోజకవర్గంలో ఎంతో మంది యువకులు చదువుకున్న నిరుద్యోగులుగా ఉన్నారని తెలిపారు. అందరికి ఉపాధి కల్పిస్తారన్నారు. తాగునీరు సమస్యలు కూడా ఉన్నాయన్నారు. నర్సిపట్నంలో అయ్యన్న పాత్రుడుకి ఓటమి భయం పట్టుకుందన్నారు. ఓటమి భయంతో చీరలు,గొడుగులు కూడా పంచుతున్నారని ఎద్దేవా చేశారు.ఎన్ని పంచిన ఓటు వేయరని తెలుసుకుని శివపురంలో ఆంజేయస్వామి ఆలయంలో మహిళలచే ప్రమాణాలు చేయించుకున్న దారుణమైన పరిస్థితి ఉందన్నారు.ఆ మహిళలను పిలిచి మాట్లాడితే  ప్రమాణం చేయకపోతే ఇబ్బందులకు గురిచేస్తారనే భయంతోనే ప్రమాణం  చేశామని తెలిపారన్నారు. కాని మనసులో దేవుని ఒక్కటే కోరుకున్నామని జగనన్న  సీఎం కావాలని కోరుకున్నామని తెలిపారన్నారు. నర్సీపట్నంలో ఈ ఐదు సంవత్సరాల్లో రౌడీయిజం పెరిగిపోయిందని, శాంతియుత వాతావరణం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు.

Back to Top